గత ప్రభుత్వ హయాంలో పాస్ పుస్తకాలపై జగన్మోహన్‌రెడ్డి చిత్రం ముద్రించడం పెను సంచలనానికి దారి తీసింది. అలాంటి తప్పులు ఈప్రభుత్వంలో జరగకుండా ఉండేందుకు చంద్రబాబు నిర్ణయం ఇప్పుడు అందర్ని ఆలోజింపజేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో భూములకు సంబంధించి తాతలు, ముత్తాతల నుండి వచ్చిన భూముల పాసు పుస్తకాలపై గతంలో జగన్ బొమ్మ ముద్రించారు. దీంతో చాలా మంది ప్రైవేటు ఆస్తులకు ముఖ్యమంత్రి బొమ్మ వేయడంపై మండిపడ్డారు.
ఇది జగన్ ప్రభుత్వాన్ని తీవ్ర విమర్శలు పాల్జేసింది. జగన్ అవసరమైతే ఈ భూములను కూడా తాకట్టు పెట్టేస్తారన్న ప్రచారంతో గత ప్రభుత్వంలో నేతలపై తీవ్ర విమర్శలొచ్చాయి. ఇప్పుడు చంద్రబాబు వాటన్నింటికి చెక్ పెడుతూ ప్రైవేటు వ్యక్తుల భూములపై ఎవరి బొమ్మ ఉండదని, కేవలం రాజముద్ర మాత్రమే ఉంటుందని ప్రకటించారు. చంద్రబాబు తీసుకున్న నిర్ణయంతో హర్షాతిరేకాలు వెల్లువెత్తుతున్నాయి.