Search
Close this search box.

  వృద్ధులు య‌వ్వ‌న‌స్తులుగా మారిపోవాల‌ని ఉందా.. ఆ సిక్రెట్ ఎంటో తెలుసా..!

July 23, 2024 9:40 AM | Aditya369 News

వృద్ధులు య‌వ్వ‌న‌స్తులుగా మారిపోవాల‌ని ఉందా.. ఆ సిక్రెట్ ఎంటో తెలుసా..!

వార్ధక్యాన్ని జయించాలనేది తరతరాలుగా మనిషి కంటున్న కల. ఆధునిక శాస్త్రసాంకేతిక పరిజ్ఞానంతో ఈ దిశగా పెద్ద ఎత్తున పరిశోధనలు జరుగుతుండగా తాజాగా కీలకమైన ముందడుగు పడింది. వార్ధక్యానికి కారణమయ్యే ఓ కీలక ప్రొటీన్‌ను శాస్త్రవేత్తలు తాజాగా గుర్తించారు. దీన్ని కట్టడి చేసే చికిత్స ద్వారా ఎలుకల జీవితకాలాన్ని ఏకంగా 25 శాతం మేర పెంచగలిగారు.
వయసు పెరుగుదలకు ఇంటర్ ల్యూకిన్ – 11 అనే ప్రొటీన్ కారణమ వుతోందని సింగపూర్‌లోని డ్యూక్ – ఎన్‌యూఎస్ మెడికల్ స్కూల్ శాస్త్రవేత్తలు గుర్తించారు. మనుషుల్లో గుండె, మూత్రపిండాలు, కాలేయం, ఊపిరితిత్తుల పనితీరుపై ఐఎల్‌-11 కీలక ప్రభావం చూపుతోందని గుర్తించారు. వయసుతో పాటు ఈ ప్రొటీన్ ఉత్పత్తి పెరుగుతున్న కొద్దీ కాలేయంలో, పొట్టలో కొవ్వు పేరుకుపోతుందని, కండరాలు బలహీనపడుతున్నాయని వెల్లడించారు.ఇవన్నీ శారీరక దృఢత్వాన్ని తగ్గించి, తద్వారా వయసు పెరుగుదల ప్రక్రియను కొనసాగిస్తున్నాయని తెలిపారు.ఐఎల్-11 ప్రొటీన్‌ను నిరోధించిన శాస్త్రవేత్తలు ఈప్ర‌భావంతో ఎలుకల జీవిత కాలాన్ని 25 శాతం మేర పెంచగలిగామ‌ని చెబుతున్నారు.
ఆడ ఎలుకల్లో ఐఎల్-11 నిరోధక చికిత్స ద్వారా శారీరక క్షీణత, వ్యాధులు, బలహీనత, మొదలైన వాటి నుంచి రక్షణ లభించింది. ఇదే చికిత్సతో మగ ఎలుకల జీవితకాలం 22.5 శాతం మేర పెరిగింది.
అంతేకాకుండా, ఆరోగ్య సమస్యలు తీసుకొచ్చే తెల్ల కొవ్వు బదులు, క్యాలరీలను ఖర్చు చేసే బ్రౌన్ ఫ్యాట్ ఉత్పత్తి ఎలుకల్లో మొదలైంది. ఈ ఫలితాలపై డ్యూక్ – ఎన్‌యూఎస్ డీన్ ప్రొఫెసర్ సథామస్ కాఫ్‌మన్ స్పందిస్తూ. ఐఎల్-11 చికిత్సతో వృద్ధులు మరింత ఎక్కువకాలం ఆరోగ్యంగా జీవించడానికి దోహద పడతాయని చెప్పారు. శారీరక దృఢత్వం పెరిగి వృద్ధులు జారి పడే అవకాశాలు తగ్గుతాయ‌న్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు