Search
Close this search box.

  శారదాపీఠం ఆస్తులపై సీబీఐ,ఈడీ లతో విచారణ జరపాలన్న సాధువులు..విశాఖ‌లో క‌ల‌క‌లం

శారదాపీఠం ఆస్తులపై సీబీఐ,ఈడీ లతో విచారణ జరపాలన్న సాధువులు..విశాఖ‌లో క‌ల‌క‌లం

స్వరూపానందకు భీమిలిలో ఇచ్చిన 15 ఎకరాలు రద్దు చేయాల్సిందే

ఏపీ సాధుపరిషత్ డిమాండ్

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌ర్వాత పీఠాలు క‌దిలిపోతున్నాయి. తాజాగా విశాఖ‌లో శారాదాపీఠంపై సాదువులు చేసిన వాఖ్య‌లు ఆస‌క్తికరంగా మారాయి. స్వ‌రూపానంద‌కు చెందిన భీమిలో ఇచ్చిన 15 ఎక‌రాలను ర‌ద్దు చేయాల‌ని డిమాండ్ చేశారు. ఏపీ సాధుప‌రిష‌త్ రాష్ట్ర అధ్య‌క్షుడు స్వామి శ్రీనివాసానంద‌, జ‌న‌సేన నేత పీతల మూర్తి యాద‌వ్ లు స్వ‌రూప‌నంద‌పై విమ‌ర్శ‌లు గుప్పించారు. శారదాపీఠం స్వాముల ఆస్తులు ఇప్పుడు వేల కోట్లకు చేరాయని వీటిపై సీబీఐ, ఈ డీ విచారణ జరపాలని వారు డిమాండు చేశారు

శారదాపీఠం పేరిట నకిలీ పీఠం పెట్టి వేల కోట్లు దోపిడీ చేసి గత వైసీపీ ప్రభుత్వం ద్వారా భీమిలిలో స్వరూపానంద కేటాయింపుజేసుకొన్న 15 ఎకరాల భూకేటాయింపులను రద్దు చేయాలని ఏపీ సాధుపరిషత్
డిమాండ్ చేశారు. భీమిలి మండలం కొత్త వలస గ్రామం సర్వే 102-2 , 103 లలో స్వరూపానందకు భీమునికొండపై కేటాయించిన భూములను వారు సందర్శించారు. ఈ భూకేటాయింపులు స్వరూపానంద వేద పాఠశాల ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే చేయించుకొన్నారని ఆరోపించారు.

అసలు పీఠానికే గుర్తింపు లేనప్పుడు, వేద విద్యార్ధులే ఇక్కడ శిక్షణ పొందనప్పుడు జగన్ ప్రభుత్వం గుడ్డిగా 15 ఎకరాలు కేటాయించడం నిబంధనలకు విరుద్ధమని కేటాయింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఈ భూములను వ్యాపార అవసరాలకు వాడతామని శారదాపీఠం ఉత్తరాధికారిగా చెప్పుకొనే సాత్మానంద మూడు నెలల క్రితం ప్రభుత్వానికి లేఖ రాసి తమ ఉద్దేశాలను బహిర్గతం చేశారని, ఈ లేఖ ఆధారంగా కేటాయింపులను నిముషంలోరద్దు చేయవచ్చని చెప్పారు.

శారదాపీఠాన్ని రద్దు చేయాలి

స్వరూపానంద కు కేటాయించిన భూమి పాండవులలో ఒకరైన భీముడు కూర్చున్న స్ధలం అని స్ధానికులు నమ్మకమని, దానిని తవ్వకాలు, కట్టడాల పేరిట ధ్వంసం చేయడం తగదని అన్నారు. భీముని పట్నానికి పేరు కూడా భీముడి వల్లే వచ్చిందని గుర్తుచేశారు. స్వరూపానందకు కేటాయించిన స్ధలంలో అత్యంత విలువైన ఔషదిమొక్కలు, చిన్న చిన్న అటవీ జంతువులు ఉన్నాయని వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉంద‌న్నారు. అక్క‌డ రూ.2 కోట్ల తో రోడ్డు నిర్మించిన అధికారుల‌పై చ‌ర్య‌లు చేపట్టాల‌న్నారు. స్వరూపనంద చరిత్ర, వారసత్వం, ధర్మాధికారి వంటివి ఏమీ లేకుండా కేవలం ఆధ్మాత్మికత ముసుగులో సంపాదన కోసం ఏర్పాటు చేసి పెందుర్తి శారదాపీఠాన్ని రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు