టాలీవుడ్ నటుడు బ్రహ్మాజీ, పాకిస్థాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించి సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు.
దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో వీరిద్దరూ అనుకోకుండా ఎదురుపడ్డారు. వెంటనే కలిసి సెల్ఫీ దిగిన బ్రహ్మాజీ, ఆ ఫోటోను తన అధికారిక ఎక్స్ ఖాతాలో షేర్ చేశారు.
ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఇక ఈ ఫోటో చూసిన నెటిజన్లు తమదైన శైలిలో కామెంట్లతో హంగామా చేస్తున్నారు.
“షోయబ్ అక్తర్‌ను టాలీవుడ్‌కు తీసుకొచ్చి విలన్‌గా పెట్టేయండి మామా” అంటూ కొందరు కామెంట్లు చేస్తుంటే.. “రావల్పిండి ఎక్స్‌ప్రెస్ పక్కన టాలీవుడ్ ఎక్స్‌ప్రెస్” అంటూ మరికొందరు సరదాగా స్పందిస్తున్నారు.
గంటకు 160 కిలోమీటర్లకు పైగా వేగంతో బంతులు విసిరిన షోయబ్ అక్తర్.. అంతర్జాతీయ క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. మరోవైపు బ్రహ్మాజీ కూడా మూడు దశాబ్దాలుగా తెలుగు సినిమాల్లో తనదైన కామెడీ టైమింగ్‌తో ప్రేక్షకులను అలరిస్తున్నారు.
మొత్తానికి క్రికెట్ ఎక్స్‌ప్రెస్, టాలీవుడ్ ఎక్స్‌ప్రెస్ ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో అభిమానులకు ఈ ఫోటో మంచి ట్రీట్‌గా మారింది.









