Search
Close this search box.

  భోగి మూవీ రివ్యూ..! శర్వానంద్ చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను మెప్పించిందా..?

November 27, 2026 10:43 PM | Aditya369 News

భోగి మూవీ రివ్యూ..! శర్వానంద్ చేసిన ఈ ప్రయత్నం ప్రేక్షకులను మెప్పించిందా..?

ఫ్యామిలీ ఆడియన్స్‌లో శర్వానంద్‌కు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. మొదటి నుంచి ఆయన ఎంచుకున్న కథలు, విభిన్నమైన పాత్రలే అందుకు ప్రధాన కారణం. అయితే అప్పుడప్పుడు మాస్ ప్రేక్షకులను కూడా ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంటారు. ఈ క్రమంలోనే మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ‘భోగి’. ఇందులో శర్వానంద్ సరసన అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్‌గా నటించగా, సంపత్ నంది దర్శకత్వం వహించారు. ఈ రోజు థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథేంటంటే..

ఆదిలాబాద్ పరిధిలోని బొగ్గులగుట్ట అనే ప్రాంతంలో కథ మొదలవుతుంది. అక్కడ గిరిజన కుటుంబాల మధ్య గంగ (శర్వానంద్) తన ఐదుగురు చెల్లెళ్లతో కలిసి జీవిస్తుంటాడు. కొలిమి పని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించే గంగకు తన చెల్లెళ్లంటే ప్రాణం. వారి జీవితంలో అన్నయ్యే సర్వస్వం. అదే ప్రాంతంలో నివసించే సులోచన (అనుపమ పరమేశ్వరన్) ఆకులతో విస్తళ్లు తయారుచేసి అమ్ముతుంటుంది. ఈ క్రమంలో గంగ, సులోచన మధ్య ప్రేమ చిగురిస్తుంది.

మరోవైపు బొగ్గులగుట్ట ప్రాంతమంతా పటేల్ (శరత్ లోహితస్య) ఆధీనంలో ఉంటుంది. అతడి మాటే అక్కడ శాసనంగా సాగుతుంది. రాజకీయ నాయకులను సైతం ప్రభావితం చేయగల స్థాయిలో పటేల్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తుంటాడు.

ఇలాంటి పరిస్థితుల్లో అమావాస్య రాత్రుల్లో యువతులు అదృశ్యమవుతుండటం గ్రామంలో కలకలం రేపుతుంది. అయితే మరుసటి రోజు ఈ ఘటనల గురించి ఎవరూ మాట్లాడకపోవడం అనుమానాలకు తావిస్తుంది. ఈ విషయం గంగ దృష్టికి రావడంతో అసలు నిజాన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తాడు. యువతుల అదృశ్యం వెనుక నరబలి ఉందని తెలుసుకుని, ఈ దారుణాలకు అడ్డుకట్ట వేయాలని నిర్ణయించుకుంటాడు.

అసలు ఈ నరబలుల వెనుక ఉన్నది ఎవరు? ఎందుకోసం ఈ దారుణాలకు పాల్పడుతున్నారు? పటేల్ పాత్ర ఏమిటి? ఈ కుట్రను బయటపెట్టే క్రమంలో గంగ ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు? అనేదే మిగతా కథ.

కథనం ఎలా ఉందంటే..

గతంలో దొరలు, పట్వారీలు, పటేళ్ల ఆధిపత్యంలో గిరిజన ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ముఖ్యంగా మూఢనమ్మకాలు, అణచివేత కారణంగా అమాయక ప్రజలు బలయ్యేవారు. అలాంటి నేపథ్యంలో ఒక సాధారణ యువకుడు అధికారాన్ని ప్రశ్నిస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయనే అంశాన్ని దర్శకుడు కథగా మలిచారు.

ప్రేమ, కుటుంబ అనుబంధాలు, గ్రామీణ వాతావరణం వంటి అంశాలను కలుపుతూ కథను ముందుకు తీసుకెళ్లారు. అయితే కథ ప్రారంభమైన విధానం ఒక సామాజిక పోరాటం నేపథ్యంలో సాగుతుందనే భావన కలిగిస్తుంది. ఆ తర్వాత రాజకీయ కుట్రలు, గిరిజనులపై జరుగుతున్న అన్యాయాలు తెరపైకి వస్తాయి. కొంతసేపటికే క్షుద్రవిద్యలు, నరబలి వంటి అంశాలు కథలోకి ప్రవేశిస్తాయి.

ఇలా కథ పదేపదే కొత్త మలుపులు తీసుకుంటున్నప్పటికీ, ఏ ప్రధాన అంశంపై ప్రేక్షకుడు దృష్టి పెట్టాలనే విషయంలో స్పష్టత లోపిస్తుంది. ట్విస్టులు ఎక్కువైనా వాటిని బలంగా కనెక్ట్ చేసే కథనం కనిపించదు.

వంద మందికి పైగా యువతులను బలిచ్చిన విషయం హీరోకు చివరి వరకు తెలియకపోవడం, ఐదుగురు చెల్లెళ్లను ఒకేసారి ఇంటి నుంచి తీసుకెళ్లిన విషయాన్ని ఎవరూ గుర్తించకపోవడం వంటి అంశాలు నమ్మశక్యంగా అనిపించవు. ఆభరణాలను కరిగించి ఆయుధాన్ని తయారు చేయడం, శవాలను ఎడ్లబండ్లపై తరలించడం, రక్తపు ధారలతో ఇంటర్వెల్ అనే అక్షరాలను చూపించడం వంటి సన్నివేశాలు అతిశయోక్తిగా అనిపిస్తాయి.

కథలో ఎన్ని మలుపులు ఉన్నా, చివర్లో వచ్చే ట్విస్ట్ మాత్రం ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తుంది. అయితే అది కొత్తదనాన్ని అందించడానికి బదులుగా పాత సినిమాలను గుర్తుచేస్తుంది. 1960ల కాలం నేపథ్యంలో కథ సాగుతున్నప్పటికీ, కొన్ని సన్నివేశాలు మాత్రం సహజత్వానికి దూరంగా ఉంటాయి.

ముఖ్యంగా అదృశ్యమైన యువతులను సైకిళ్లపై తరలించే సన్నివేశాలు అంతగా నమ్మదగినవిగా అనిపించవు. ఇక సెకండాఫ్ నుంచి ప్రతీకార ఘట్టాలు మొదలవుతాయి. వరుసగా యాక్షన్ సన్నివేశాలు వచ్చినప్పటికీ, వాటికి అవసరమైన భావోద్వేగ బలం లేకపోవడంతో ప్రేక్షకులు కథతో పూర్తిగా కనెక్ట్ కాలేరు.

నటీనటుల పనితీరు..

శర్వానంద్ తన లుక్, బాడీ లాంగ్వేజ్ విషయంలో కొత్తగా కనిపించే ప్రయత్నం చేశారు. అయితే బలహీనమైన కథనం కారణంగా ఆయన నటనకు పూర్తిస్థాయిలో అవకాశం దక్కలేదు. అనుపమ పరమేశ్వరన్ పాత్రకు పెద్దగా ప్రాధాన్యత లేకపోవడం నిరాశ కలిగిస్తుంది.

డింపుల్ హయతి పోషించిన పాత్ర కూడా కథకు ఎంతవరకు ఉపయోగపడిందనే సందేహం కలుగుతుంది. ఇక ఆడుకాలం నరేన్ వంటి నటుడిని మరింత సమర్థంగా ఉపయోగించుకునే అవకాశం ఉన్నప్పటికీ, ఆ దిశగా దర్శకుడు పెద్దగా ప్రయత్నించలేదు.

సాంకేతిక విభాగం..

కిశోర్ కుమార్ సినిమాటోగ్రఫీ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది. ముఖ్యంగా అడవి నేపథ్యంలో వచ్చే విజువల్స్ బాగున్నాయి. భీమ్స్ అందించిన నేపథ్య సంగీతం పర్వాలేదనిపిస్తుంది. తమ్మిరాజు ఎడిటింగ్ విషయంలో మరికొన్ని యాక్షన్ సన్నివేశాలను కుదించి ఉంటే బాగుండేది.

సాధారణంగా ఇంటర్వెల్ సన్నివేశం ద్వితీయార్థంపై ఆసక్తిని పెంచాలి. కానీ ఈ సినిమాలో ఇంటర్వెల్ బ్యాంగ్ ఆ స్థాయిలో ప్రభావం చూపించదు. బలహీనమైన స్క్రీన్‌ప్లే, భావోద్వేగాల లోపం సినిమా అనుభూతిని తగ్గిస్తాయి.

ఫైనల్‌గా చెప్పాలంటే..

విభిన్నమైన కథాంశం, గిరిజన ప్రాంతం నేపథ్యం, శర్వానంద్ కొత్త లుక్ వంటి అంశాలతో ఆసక్తిని కలిగించిన ‘భోగి’ సినిమా, కథనంలో మాత్రం ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయింది. ట్విస్టులు, యాక్షన్ సన్నివేశాలు ఉన్నప్పటికీ భావోద్వేగాలు ప్రేక్షకులకు చేరువ కాలేదు. మంచి ప్రయత్నం చేసినప్పటికీ, బలమైన స్క్రీన్‌ప్లే లేకపోవడం ఈ సినిమాకు ప్రధానమైన మైనస్‌గా చెప్పుకోవచ్చు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore