Search
Close this search box.

  అడివి శేష్ పెళ్లిపై జగపతిబాబు షాకింగ్ కామెంట్స్..! M అంటే ఎవరు..?

November 26, 2026 11:30 PM | Aditya369 News

అడివి శేష్ పెళ్లిపై జగపతిబాబు షాకింగ్ కామెంట్స్..! M అంటే ఎవరు..?

టాలీవుడ్‌లో విభిన్నమైన కథలను ఎంచుకుంటూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న హీరో అడివి శేష్. తక్కువ సినిమాలతోనే మంచి క్రేజ్ సంపాదించుకున్న ఈ హీరో ప్రస్తుతం వరుస ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. తాజాగా జగపతిబాబు హోస్ట్‌గా వ్యవహరిస్తున్న ‘జయమ్ము నిశ్చయమ్మురా సీజన్ 2’ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు. ఈ ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఈ కార్యక్రమంలో అడివి శేష్‌తో పాటు నటుడు, దర్శకుడు రాహుల్ రవీంద్రన్ కూడా పాల్గొన్నారు. ముగ్గురి మధ్య సినిమాలు, వ్యక్తిగత విషయాలకు సంబంధించిన సరదా సంభాషణలు జరిగాయి. ముఖ్యంగా శేష్ పెళ్లి ప్రస్తావన రావడంతో ఈ ప్రోమో మరింత ఆసక్తికరంగా మారింది.

శేష్ పెళ్లి ఎప్పుడంటూ జగపతిబాబు ప్రశ్నలు!

మాటల మధ్యలో జగపతిబాబు అడివి శేష్‌ను పెళ్లి ఎప్పుడు చేసుకుంటావంటూ ప్రశ్నించారు. దీంతో శేష్ ఒక్కసారిగా నీళ్లు తాగుతూ సమాధానం చెప్పకుండా తప్పించుకునే ప్రయత్నం చేశారు. అయితే జగపతిబాబు అంతటితో ఆగకుండా ఆ అమ్మాయి ఎవరు? ఆమె పేరు ఏమిటి? M అంటే ఏంటి? అంటూ వరుస ప్రశ్నలతో శేష్‌ను ఇబ్బంది పెట్టారు.

ఈ ప్రశ్నలను బట్టి శేష్ జీవితంలో ఒక అమ్మాయి ఉందా? ఆమె పేరు M అక్షరంతో ప్రారంభమవుతుందా? అనే ఆసక్తి అభిమానుల్లో మొదలైంది. అయితే దీనిపై శేష్ నుంచి ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. పూర్తి ఎపిసోడ్ ప్రసారమైతేనే ఈ విషయంపై మరింత క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

గతంలో కూడా అడివి శేష్ ప్రేమ, పెళ్లికి సంబంధించి పలు వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. ముఖ్యంగా నిర్మాత సుప్రియ యార్లగడ్డతో ఆయన ప్రేమలో ఉన్నారంటూ ప్రచారం జరగగా, ఆ వార్తల్లో నిజం లేదని శేష్ స్పష్టం చేశారు.

మేజర్ కుటుంబంతో ప్రత్యేక అనుబంధం!

ఇక ఈ కార్యక్రమంలో శేష్ నటించిన ‘మేజర్’ సినిమా గురించి కూడా ఆసక్తికరమైన విషయాలు పంచుకున్నారు. ఈ సినిమా తర్వాత అమర వీరుడు సందీప్ ఉన్నికృష్ణన్ కుటుంబంతో తనకు ఎంతో అనుబంధం ఏర్పడిందని తెలిపారు. వారి కుటుంబ సభ్యులు తనను సొంత కొడుకులా చూసుకుంటారని, సందీప్‌కు పెట్టినట్టే తనకు కూడా ప్రేమగా భోజనం తినిపిస్తారని భావోద్వేగంగా చెప్పారు.

అంతేకాకుండా సందీప్ ఉన్నికృష్ణన్ ట్రస్ట్‌ను అడివి శేష్ దత్తత తీసుకున్న విషయాన్ని కూడా జగపతిబాబు ఈ సందర్భంగా వెల్లడించారు. దీంతో శేష్ నటనతోనే కాకుండా తన మంచి మనసుతో కూడా అభిమానుల ప్రశంసలు అందుకుంటున్నారు.

మొత్తానికి ఈ ప్రోమోలో శేష్ పెళ్లి గురించి వచ్చిన ప్రశ్నలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి. మరి జగపతిబాబు అడిగిన M వెనుక ఉన్న అసలు కథ ఏమిటో తెలియాలంటే పూర్తి ఎపిసోడ్ కోసం వేచి చూడాల్సిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore