డబ్బు, సంపద, హోదా ఎప్పటికీ శాశ్వతం కాదు.. ఆధ్యాత్మికత, ధర్మం, సేవా భావమే మనిషికి అసలైన సంతృప్తిని, సంతోషాన్ని ఇస్తాయని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. ప్రపంచంలో ఎంతోమంది బిలియనీర్లు, ట్రిలియనీర్లు ఉన్నారని… కానీ సంపా దించిన సంపదను సద్వినియోగం చేసుకునే అదృష్టం కొందరికే దక్కుతుందన్నారు. ఆ కోవలోనే నిలిచి తమ దాతృత్వాన్ని చాటుకున్న చెన్నైకు చెందిన వర్ధమాన్ జైన్, రాధికా జైన్ దంపతులు అందరికీ ఆదర్శంగా ఉన్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు.

శ్రీవారికి 120 కిలోల బంగారు ఆభరణాలు అలంకరిస్తారని, దేవుని ఆదేశంతోనే 121 కిలోల బంగారు, వజ్రాభరణాలను సమర్పించామని జైన్ దంపతులు చెప్పడం, వారి భక్తికి నిదర్శనమన్నారు. పూర్వం పల్లవ, చోళ, చేర, పాండ్య రాజులతో పాటు మైసూర్, మరాఠా రాజులు ఆలయాన్ని అభివృద్ధి చేశారని గుర్తు చేశారు.









