రాష్ట్రంలో తొలి విడత పంచాయతీ ఎన్నికలు 26 జిల్లాల్లోని 3,240 పంచాయతీలలో జరగనున్నాయి. ఇప్పటికే తొలివిడతలో 709 పంచాయతీలు ఏకగ్రీవం కాగా, మిగిలిన 3,240 పంచాయతీల్లో ఎన్నికలు నిర్వహిస్తున్నారు. ఈ దశ ఎన్నికల్లో 74.45 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. పంచాయతీల్లో ఉదయం 7 గంటల నుండి మధ్యాహ్నాం 1 గంట వరకూ పోలింగ్ జరగనుంది. మధ్యాహ్నాం 2 గంటల తర్వాత కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. అనంతరం ఉపసర్పంచి ఎన్నికను వెను వెంటనే నిర్వహిస్తారు. పంచాయతీలతో పాటు 4 కార్పొరేషన్లు, 19 మున్సిపాలిటీ / నగర పంచాయతీలకు కలిపి 23 స్థానిక సంస్థలకు కూడా 26వ తేదినే ఎన్నికల పోలింగ్ జరగనుంది. వీటి ఫలితాలు నవంబర్ 30న వెల్లడిస్తారు.









