అధికారిక సమాచారం ప్రకారం ఈ నెల 4వ తేదీన కాకినాడ నుంచి బయలుదేరి వేటకు వెళ్లిన మత్స్యకారులు 10వ తేదీ విశాఖ హార్బర్ కు చేరుకున్నారు. అక్కడ తమ వద్ద ఉన్న చేపలు విక్రయించి, 10వ తేదీ తిరిగి సముద్రంలోకి వెళ్లారు. 14వ తేదీ వరకు ఫోన్లో తమ కుటుంబ సభ్యులకు అందుబాటులో ఉన్నారు. ఆ తర్వాత వారి నుండి ఎటువంటి సమాచారం లేదు. కాకినాడ, చెన్నై, ఒడిశా కోస్టు గార్డు బృందాలు గాలిస్తున్నాయి. ఇప్పటికే నేవీ హెలీకాప్టర్ సహాయంతో కూడా గాలింపు చేపట్టారు. బంగ్లాదేశ్, మయన్మార్ కోస్టు గార్డులకి సైతం అధికారులు సమాచారం ఇచ్చారు. బోటులో వెళ్లిన ఏడుగురి మొబైల్ ఫోన్లు మనుగడలో లేవని, బోటుకు అమర్చిన జీపీఎస్ ట్రాన్స్ పాండర్ కూడా ఆన్ చేయకపోవడం వల్ల పని చేయకపోవడంతో ఆందోళన పెరుగుతోంది.









