ఈ నేపథ్యంలో సోమవారం హైదరాబాద్‌లో ‘ఫ్యామిలీ ప్యాక్’ టీజర్‌ను చిత్ర బృందం విడుదల చేసింది. ఈ సందర్భంగా నిర్వహించిన టీజర్ లాంచ్ కార్యక్రమంలో సాక్షి మడోల్కర్ తన షూటింగ్ అనుభవాలను పంచుకున్నారు. ముఖ్యంగా శ్రీవిష్ణు కామెడీ టైమింగ్‌ను అందుకోవడం చాలా కష్టమని ఆమె తెలిపారు. ఆయన కామెడీ టైమింగ్ మరో స్థాయిలో ఉంటుందని, ఆయనతో కలిసి నటించడం ద్వారా ఎన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పారు.
కామెడీ సినిమా చేయడం తనకు ఇదే మొదటిసారి అని సాక్షి వెల్లడించారు. చిత్ర బృందంలోని మిగతా సభ్యులంతా గతంలో కలిసి పనిచేశారని, తాను మాత్రమే కొత్త సభ్యురాలిగా వచ్చానని తెలిపారు. అయినప్పటికీ అందరూ ఎంతో సహకరించారని, షూటింగ్ సరదాగా సాగిందని చెప్పారు. తన పాత్రకు న్యాయం చేయాలనే బాధ్యత, ఒత్తిడి ఉన్నప్పటికీ దర్శకుడు, నిర్మాతలు ఎంతో ఆప్యాయంగా చూసుకున్నారని, చిత్ర బృందంలోని ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు.









