Search
Close this search box.

  శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్ వెనుక ఇంత కామెడీ ఉందా..?

November 20, 2026 11:04 PM | Aditya369 News

శ్రీవిష్ణు ‘ఫ్యామిలీ ప్యాక్’ టైటిల్ వెనుక ఇంత కామెడీ ఉందా..?

‘సామజవరగమన’ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న హీరో శ్రీవిష్ణు, దర్శకుడు రామ్ అబ్బరాజు మరోసారి కలిసి పనిచేస్తున్నారు. వీరిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న తాజా చిత్రానికి ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.

అయితే ఈ సినిమాకు ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే పేరు పెట్టడం వెనుక అసలు కారణమేంటనే చర్చ సోషల్ మీడియాలో మొదలైంది. దీంతో మూవీ టీమ్ కూడా ఈ ప్రశ్నకు తమదైన స్టైల్‌లో ఫన్నీ సమాధానాలు ఇచ్చింది. సినిమాలో నటిస్తున్న నటీనటులంతా ఒక్కొక్కరిగా టైటిల్ వెనుక ఉన్న కారణాన్ని సరదాగా వివరించారు.

ముందుగా హీరోయిన్ సాక్షి మదోల్కర్ మాట్లాడుతూ, ఈ టైటిల్ వెనుక పెద్ద కథే ఉందని చెప్పి ఆసక్తి పెంచారు. ఇక కమెడియన్ సుదర్శన్ మాత్రం దేవుడే దర్శకుడి దగ్గరకు వచ్చి, సంక్రాంతికి కుటుంబమంతా కలిసి చూసి ఎంజాయ్ చేసే సినిమా కాబట్టి ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే పేరు పెట్టాలని చెప్పినట్లు సరదాగా కామెంట్ చేశారు.

మరోవైపు ఈ సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటిస్తున్న బుల్లిరాజు చెప్పిన సమాధానం అందరినీ నవ్వించింది. సినిమాలో ఒక కుటుంబం ఆకలితో బిర్యానీ ఆర్డర్ చేస్తుందని, ఆ పార్సిల్ తీసుకొచ్చిన వ్యక్తి దొంగ కావడంతో కుటుంబ సభ్యులంతా కలిసి అతడిని ప్యాక్ చేస్తారని తనదైన ఊహతో టైటిల్‌కు అర్థం చెప్పాడు.

ఇక కమెడియన్ సత్య మాట్లాడుతూ, మొదట ఈ సినిమాకు చాలా టైటిల్స్ అనుకున్నామని తెలిపారు. అయితే ఈ మధ్య ఏ సినిమా టైటిల్ ప్రకటించినా చివరికి మారుస్తున్నారనే కామెంట్స్ వస్తున్నాయని, అందుకే ‘ఫ్యామిలీ’ అనే పదంతో టైటిల్ పెడితే ఎమోషన్‌కు కనెక్ట్ అయి ఎవరూ మార్చరనే ఉద్దేశంతో ‘ఫ్యామిలీ ప్యాక్’ అని పెట్టినట్లు చమత్కరించారు.

సినిమాలో కీలక పాత్ర పోషిస్తున్న అభిరామి మరో ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు. మొదట ఈ సినిమాకు ‘ఫ్యామిలీ క్రాక్’ అనే టైటిల్ అనుకున్నామని, అయితే న్యూమరాలజీ ప్రకారం అది కుదరకపోవడంతో ‘ఫ్యామిలీ ప్యాక్’గా మార్చినట్లు చెప్పారు. ఇప్పటికీ సినిమాల టైటిల్స్ విషయంలో న్యూమరాలజీని ఫాలో అవ్వడం ఏంటంటూ సరదాగా సెటైర్ కూడా వేశారు.

సీనియర్ నటుడు నరేష్ మాట్లాడుతూ, ప్రస్తుత రోజుల్లో కుటుంబ కథలకు అంతగా ప్రాధాన్యత ఇవ్వడం లేదని అభిప్రాయపడ్డారు. ఎప్పుడూ ప్రేమకథలే కాకుండా అప్పుడప్పుడు కుటుంబమంతా కలిసి చూసే సినిమాలకు కూడా ప్రేక్షకులు ఆదరణ ఇవ్వాలని, అందుకే ఈ సినిమాకు ఈ టైటిల్ పెట్టినట్లు వివరించారు.

చివరగా హీరో శ్రీవిష్ణు తనదైన కామెడీ టైమింగ్‌తో టైటిల్ వెనుక ఉన్న అసలు ఉద్దేశాన్ని చెప్పుకొచ్చారు. థియేటర్లకు కుటుంబ సభ్యులంతా ఒకేసారి వచ్చి, సినిమా చూసి సరదాగా నవ్వుకోవాలని, సినిమాలో ఫన్‌తో పాటు అన్ని రకాల ఎలిమెంట్స్‌ను ఫుల్‌గా ప్యాక్ చేశామని అందుకే ‘ఫ్యామిలీ ప్యాక్’ అనే పేరు పెట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా వచ్చే సంక్రాంతి సాధారణ సంక్రాంతి కాదని, ఫ్యామిలీ ప్యాక్డ్ సంక్రాంతి అంటూ నవ్వులు పూయించారు.

ఇదిలా ఉంటే, ఈ సినిమా నుంచి త్వరలోనే వరుస అప్‌డేట్స్ ఇవ్వబోతున్నట్లు మూవీ టీమ్ హింట్ ఇచ్చింది. గతంలో ‘సామజవరగమన’తో ప్రేక్షకులను నవ్వించిన శ్రీవిష్ణు, రామ్ అబ్బరాజు మరోసారి ఎలాంటి వినోదాన్ని అందించబోతున్నారో చూడాలి. ముఖ్యంగా సంక్రాంతి బరిలో ఈ ‘ఫ్యామిలీ ప్యాక్’ సినిమా ఎలాంటి సందడి చేస్తుందో వేచి చూడాల్సిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు