Search
Close this search box.

  డేట్‌కు వచ్చే అబ్బాయిలకు అనస్వర రాజన్ కండిషన్స్.. ఏమేం చెప్పిందో తెలుసా..?

November 13, 2026 7:03 AM | Aditya369 News

డేట్‌కు వచ్చే అబ్బాయిలకు అనస్వర రాజన్ కండిషన్స్.. ఏమేం చెప్పిందో తెలుసా..?

మలయాళ ముద్దుగుమ్మ అనస్వర రాజన్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఇప్పటికే తన నటనతో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్‌లో వరుస అవకాశాలతో బిజీగా మారిపోయారు. ఇటీవల ‘ఛాంపియన్’ సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్న అనస్వర, ఇప్పుడు ‘ఇట్లు అర్జున’ అనే మరో ఆసక్తికరమైన చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. నవంబర్ 13న ఈ సినిమా విడుదల కానుండటంతో ప్రమోషన్లలో చురుగ్గా పాల్గొంటున్నారు.

అబ్బాయిల్లో ఆ క్వాలిటీస్ ఉండాలి!

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనస్వర రాజన్ తన వ్యక్తిగత ఇష్టాలు, రొమాంటిక్ డేటింగ్ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా అబ్బాయిల్లో ఎలాంటి లక్షణాలు ఉంటే నచ్చుతారని అడగ్గా.. తనకు ఎమోషనల్‌గా మెచ్యూరిటీ ఉన్న అబ్బాయిలంటే ఇష్టమని తెలిపారు. అంతేకాకుండా సాఫ్ట్‌గా మాట్లాడే వ్యక్తిత్వం ఉండాలని, బయటకు ఎలా కనిపిస్తున్నారనే దానికంటే వారు మాట్లాడే విధానం, ప్రవర్తనే తనకు ముఖ్యమని చెప్పారు.

డేట్‌కు వస్తే పువ్వులు తీసుకురావాల్సిందే!

ఇక ఆల్ఫా టైప్ అబ్బాయిలంటే తనకు పెద్దగా ఇష్టం ఉండదని అనస్వర వెల్లడించారు. తన రొమాంటిక్ డేట్ ఎలా ఉండాలనే ప్రశ్నకు సమాధానమిస్తూ.. తనకు పువ్వులంటే చాలా ఇష్టమని చెప్పారు. తనతో డేట్‌కు వచ్చే వ్యక్తి కచ్చితంగా సన్‌ఫ్లవర్స్‌తో పాటు వైట్ పియోనీ పువ్వులు తీసుకురావాలని సరదాగా తన కోరికను బయటపెట్టారు. ప్రకృతి అందాలను ఆస్వాదిస్తూ, ఇద్దరూ మనసు విప్పి మాట్లాడుకునేలా డేట్ ఉండాలని తెలిపారు. ప్రస్తుతం అనస్వర చేసిన ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

చిరంజీవి సినిమాలో మెగాస్టార్ కూతురిగా!

ఇక ‘ఇట్లు అర్జున’ సినిమా విషయానికి వస్తే.. ఇది ఓ అందమైన ప్రేమకథగా ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇందులో సాయి అనీష్ హీరోగా నటిస్తుండగా, ఆయన మూగవాడి పాత్రలో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని పెంచింది. నవంబర్ 13న విడుదల కానున్న ఈ చిత్రం ఎలాంటి విజయాన్ని అందుకుంటుందో చూడాలి.

మరోవైపు అనస్వర రాజన్ మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘కాకా’ సినిమాలో కూడా కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రంలో ఆమె డాక్టర్‌గా, చిరంజీవి కుమార్తె పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఇలా వరుస సినిమాలతో టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకునే దిశగా అనస్వర అడుగులు వేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు