కాకినాడ జిల్లా పరిషత్ ఛైర్ పర్సన్‌గా పెద్దాపురం జెడ్పీటీసీగా ఎన్నికైన పిఠాపురం మండలం మల్లాం గ్రామానికి చెందిన బుర్రా దివ్య సునీత రాజ్ ఎన్నికయ్యారు. వైస్ చైర్మన్ గా కరప జడ్పిటిసి పంపన రాజేశ్వరి దేవిని ఎన్నిక చేశారు. కాకినాడ జెడ్పీ మందిరంలో తొలుత జెడ్పీసీల ప్రమాణస్వీకారం అనంతరం జరిగిన ఎన్నికలో ఛైర్ పర్సన్, వైస్ ఛైర్ పర్సన్ లను కలెక్టర్ హరింధర ప్రసాద్ ప్రకటించారు. జనసేనకు ఛైర్పర్సన్ పదవి కేటాయించగా, టిడిపికి వైస్ ఛైర్ పర్సన్ పదవి దక్కింది.









