చిన్నారులు, తల్లుల ఆరోగ్యానికి సహకరించే అంగన్‌వాడీలు..ఆశా వర్కర్లే నిజమైన సేవకులని, వారి సేవలు ఎనలేనివని మాజీ కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ అన్నారు. కాకినాడ జిల్లా పిఠాపురంలో అపోలో ఆరంభ్ పేరుతో మోడల్ అంగన్ వాడీ కేంద్రాన్ని పిఠాపురం అగ్రహారంలో అపోలో వైస్ ఛైర్మన్ కొణిదెల ఉపాసనతో కలిపి ఆమె ప్రారంభించారు. దేశంలో 119 మోడల్ అంగన్ వాడీ కేంద్రాలు నిర్మాణానికి అపోలో ముందుకు రావడం శుభపరిణామం అన్నారు. ఉపాసన చేస్తున్న సేవలను ఇరానీ కొనియాడారు.









