సూపర్ స్టార్ మహేశ్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘వారణాసి’పై ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ప్రతి చిన్న విషయం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుతోంది. తాజాగా చిత్ర బృందం ఇచ్చిన ఓ అప్డేట్ అభిమానుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపుతోంది.
తాజా సమాచారం ప్రకారం ‘వారణాసి’ సినిమా షూటింగ్ పూర్తయింది. ఈ విషయాన్ని చిత్ర యూనిట్ అధికారికంగా సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా కొనసాగుతున్నాయని తెలిపింది. ముఖ్యంగా విజువల్ ఎఫెక్ట్స్, రీ-రికార్డింగ్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే డబ్బింగ్ కార్యక్రమాలు కూడా ప్రారంభం కానున్నాయి.
అయితే ఈ అప్డేట్లో అందరినీ ఎక్కువగా ఆకర్షించిన విషయం మరోటి ఉంది. షూటింగ్ పూర్తయినట్లు ప్రకటించిన చిత్ర బృందం.. అసలైన సర్ప్రైజ్ కోసం మరికొంత కాలం వేచి చూడాలంటూ ఆసక్తికరమైన హింట్ ఇచ్చింది. దీంతో రాజమౌళి త్వరలో ఏదైనా భారీ అప్డేట్ ఇవ్వబోతున్నారా అనే చర్చ మొదలైంది.
మహేశ్ బాబు కొత్త లుక్‌ను విడుదల చేస్తారా? సినిమా నుంచి పవర్ఫుల్ గ్లింప్స్ తీసుకొస్తారా? లేక మేకింగ్ వీడియోతో అభిమానులకు సర్ప్రైజ్ ఇస్తారా? అనే ఊహాగానాలు సోషల్ మీడియాలో జోరందుకున్నాయి. అయితే ఆ సర్ప్రైజ్ ఏంటన్నది చిత్ర బృందం అధికారికంగా వెల్లడించాల్సి ఉంది.
ఇక ఈ సినిమాలో మహేశ్ బాబుతో పాటు పలువురు ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ప్రపంచ స్థాయి విజువల్స్‌తో తెరకెక్కుతున్న ఈ అడ్వెంచర్ థ్రిల్లర్‌ను 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి రాజమౌళి చెప్పిన ఆ అసలైన బ్లాస్ట్ ఎప్పుడు రాబోతుందో చూడాలి.









