బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ ప్రధాన పాత్రలో, సాయి పల్లవి హీరోయిన్గా దర్శకుడు నితీష్ తివారి తెరకెక్కించిన భారీ ప్రాజెక్ట్ ‘రామాయణ’. భారీ అంచనాల మధ్య ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ విజువల్ వండర్ బాక్సాఫీస్ దగ్గర సంచలన వసూళ్లతో దూసుకుపోతున్నట్లు సమాచారం. ఇప్పటికే వరల్డ్‌వైడ్‌గా 8 రోజుల థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ఈ తక్కువ సమయంలోనే ఓ అరుదైన రికార్డును సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది.
రణబీర్ కపూర్ గతంలో నటించిన ‘అనిమల్’ సినిమా ఏ సర్టిఫికెట్తో విడుదలై బాక్సాఫీస్ వద్ద భారీ సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే ఆ సినిమా లాంగ్ రన్లో రూ.1000 కోట్ల మార్కును అందుకోలేకపోయింది. కానీ ఇప్పుడు ‘రామాయణ’ మాత్రం కేవలం 8 రోజుల్లోనే ఆ మార్కును అధిగమించి రణబీర్ కెరీర్లో మరో భారీ రికార్డును నమోదు చేసినట్లు వార్తలు వస్తున్నాయి.
దీంతో రణబీర్ కపూర్ అరుదైన రూ.1000 కోట్ల క్లబ్‌లోకి చేరినట్టయింది. ఇక ఈ సినిమా తదుపరి లక్ష్యం రూ.1500 కోట్ల మార్కుగా కనిపిస్తోంది. ప్రస్తుతం కొనసాగుతున్న వసూళ్ల జోరు ఇలాగే ఉంటే ఈ మైలురాయిని కూడా అందుకునే అవకాశాలు ఉన్నాయని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
మొత్తానికి ‘రామాయణ’ బాక్సాఫీస్ దగ్గర తన ప్రభంజనాన్ని కొనసాగిస్తోంది. మరి రణబీర్ కపూర్ నటించిన ఈ విజువల్ వండర్ చివరకు ఎంతటి భారీ వసూళ్లను సాధిస్తుంది? రూ.1500 కోట్ల మార్కును అందుకుంటుందా? అనేది చూడాలి.









