Search
Close this search box.

  బాలీవుడ్‌లోకి రవిబాబు ఎంట్రీ.. కంగనాతో సాలిడ్ హారర్ మూవీ..!

November 13, 2026 10:25 PM | Aditya369 News

బాలీవుడ్‌లోకి రవిబాబు ఎంట్రీ.. కంగనాతో సాలిడ్ హారర్ మూవీ..!

టాలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్న దర్శకుల్లో రవిబాబు కూడా ఒకరు. కామెడీ, థ్రిల్లర్ జానర్లలో విభిన్నమైన కథలను తెరకెక్కిస్తూ తనదైన మేకింగ్ స్టైల్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ‘అల్లరి’, ‘నువ్విలా’, ‘నచ్చావులే’ వంటి సినిమాలతో మంచి వినోదాన్ని అందించిన ఆయన.. ‘అమరావతి’, ‘అనసూయ’, ‘అవును’ వంటి చిత్రాలతో థ్రిల్లర్ జానర్‌లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నారు.

ఈ ఏడాది ‘రేజర్’ అంటూ ఓ వైలెంట్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన రవిబాబు.. ఇప్పుడు మరో ఆసక్తికరమైన ప్రాజెక్ట్‌తో వార్తల్లో నిలిచారు. ఈసారి ఆయన బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రలో నటించనున్న ఓ హారర్ థ్రిల్లర్‌ను అధికారికంగా ప్రకటించారు. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘స్కేరీ పిక్చర్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు.

అయితే ఈ సినిమాకు సంబంధించిన తెలుగు వెర్షన్ విడుదలపై ఇప్పటివరకు ఎలాంటి స్పష్టత ఇవ్వలేదు. ప్రస్తుతానికి హిందీ చిత్రంగానే ఈ ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. గత కొంతకాలంగా ఆశించిన స్థాయిలో సినిమాలు అందించలేకపోతున్న రవిబాబు.. ఈసారి హారర్ థ్రిల్లర్‌తో గట్టి కమ్‌బ్యాక్ ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది.

ముఖ్యంగా రవిబాబు మేకింగ్ స్టైల్‌కు హారర్ థ్రిల్లర్ జానర్ తోడైతే ప్రేక్షకులకు ఎలాంటి అనుభూతిని అందిస్తుందనే ఆసక్తి నెలకొంది. ఈ సినిమాను 2027లో విడుదల చేయాలని మేకర్స్ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. మరి కంగనా రనౌత్‌తో రవిబాబు ఎలాంటి హారర్ థ్రిల్లర్‌ను తెరకెక్కిస్తారో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు