Search
Close this search box.

  హారికా హాసినికి త్రివిక్రమ్ గుడ్‌బై చెప్పారా .? ఎన్టీఆర్ మూవీపై నెట్టింట రచ్చ..!

November 12, 2026 9:01 AM | Aditya369 News

హారికా హాసినికి త్రివిక్రమ్ గుడ్‌బై చెప్పారా .? ఎన్టీఆర్ మూవీపై నెట్టింట రచ్చ..!

ప్రస్తుతం టాలీవుడ్‌లో భారీ అంచనాలు నెలకొన్న క్రేజీ ప్రాజెక్టుల్లో మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా కూడా ఒకటి. అనౌన్స్మెంట్‌తోనే ప్రేక్షకుల్లో భారీ హైప్ క్రియేట్ చేసిన ఈ మూవీ, ఎన్టీఆర్ ప్రస్తుతం నటిస్తున్న ‘డ్రాగన్’ సినిమా పూర్తయిన తర్వాత సెట్స్‌పైకి వెళ్లనుంది.

ఇక ఈ సినిమాను త్రివిక్రమ్‌కు ఎంతోకాలంగా సన్నిహితంగా ఉన్న నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ నిర్మించనుందనే ప్రచారం ఉంది. అయితే తాజాగా ఈ ప్రాజెక్ట్ నిర్మాణ సంస్థ విషయంలో కొన్ని ఆసక్తికరమైన వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. త్రివిక్రమ్ తన చిరకాల నిర్మాణ సంస్థ హారికా హాసినిని పక్కనపెట్టి, మరో ప్రముఖ నిర్మాణ సంస్థతో ఎన్టీఆర్ సినిమాను తెరకెక్కించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది.

ఇటీవల త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ‘ఆదర్శ కుటుంబం’ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో విజయం సాధించలేకపోయింది. దీంతో ఈ సినిమా ఫలితమే త్రివిక్రమ్, హారికా హాసిని సంస్థ మధ్య దూరం పెరగడానికి కారణమైందా అనే చర్చ కూడా మొదలైంది. అయితే గతంలో ‘అజ్ఞాతవాసి’ వంటి సినిమా ఫలితం తర్వాత కూడా వీరి మధ్య బంధం కొనసాగింది. కాబట్టి ఇప్పుడు వీరిద్దరూ విడిపోయారనే వార్తలను ఇప్పుడే నమ్మలేం.

మొత్తానికి ఎన్టీఆర్ ‘గాడ్ ఆఫ్ వార్’ సినిమా నిర్మాణ బాధ్యతలు ఎవరు చేపడతారనే విషయంలో ప్రస్తుతం వినిపిస్తున్నవన్నీ ప్రచారాలు మాత్రమే. దీనిపై చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వస్తేనే అసలు విషయం స్పష్టమవుతుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు