సూపర్‌స్టార్ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్లో తెరకెక్కుతున్న భారీ చిత్రం వారణాసి ప్రస్తుతం టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారింది. ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ పాన్ వరల్డ్ సినిమాను కేఎల్ నారాయణ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2027 ఏప్రిల్ 7న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.
అయితే ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ బిజినెస్‌కు సంబంధించిన వార్తలు ఆసక్తికరంగా మారాయి. వారణాసి డిజిటల్ హక్కుల కోసం ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్‌ఫ్లిక్స్ ఏకంగా రూ.150 కోట్ల ఆఫర్ ఇచ్చినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. కానీ సినిమా బడ్జెట్, రాజమౌళికి అంతర్జాతీయ స్థాయిలో ఉన్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకుంటే ఈ మొత్తం చాలా తక్కువని మేకర్స్ భావిస్తున్నారట.
దీంతో ఓటీటీ హక్కుల విషయంలో రాజమౌళి సరికొత్త వ్యూహాన్ని అమలు చేయాలని చూస్తున్నట్లు సమాచారం. అన్ని భాషల డిజిటల్ రైట్స్‌ను ఒకే సంస్థకు విక్రయించకుండా ప్రాంతాల వారీగా వేర్వేరు ఓటీటీ సంస్థలకు విక్రయించేలా ప్లాన్ చేస్తున్నారట. ఇందులో భాగంగా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ భాషల హక్కులను ఒక సంస్థకు, హిందీ హక్కులను మరో సంస్థకు, అంతర్జాతీయ భాషల హక్కులను గ్లోబల్ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌కు విక్రయించేలా చర్చలు జరుగుతున్నాయని తెలుస్తోంది.
ఈ విధానం ద్వారా డిజిటల్ హక్కుల నుంచే భారీ మొత్తాన్ని రాబట్టడంతో పాటు సినిమా బడ్జెట్లో గణనీయమైన భాగాన్ని రికవరీ చేయవచ్చని మేకర్స్ భావిస్తున్నారట. ఈ ఏడాది చివరిలోపు ఓటీటీ ఒప్పందాలను పూర్తి చేయాలని నిర్మాతలు లక్ష్యంగా పెట్టుకున్నట్లు సమాచారం. మరి వారణాసి డిజిటల్ రైట్స్ బిజినెస్ ఎన్ని రికార్డులను సృష్టిస్తుందో చూడాలి!









