Search
Close this search box.

  బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్ ఫిక్స్..? ఆ జోడి మళ్ళీ రిపీట్..?

October 26, 2026 11:47 PM | Aditya369 News

బాలయ్య – కొరటాల శివ సినిమాలో హీరోయిన్ ఫిక్స్..? ఆ జోడి మళ్ళీ రిపీట్..?

నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ క్రేజీ ప్రాజెక్ట్ తెరకెక్కబోతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఎన్నో వార్తలు వినిపిస్తుండగా.. తాజాగా హీరోయిన్ విషయంలో ఓ ఆసక్తికరమైన అప్డేట్ తెరపైకి వచ్చింది.

ఈ సినిమాలో బాలయ్య సరసన సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించబోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్ వినిపిస్తోంది. గతంలో ‘అఖండ 2’లో బాలయ్యతో కలిసి నటించిన సంయుక్త.. మరోసారి ఆయనతో జోడీ కట్టబోతుందనే వార్త ఇప్పుడు ఆసక్తిని పెంచుతోంది. అయితే దీనిపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

ఇక ఈ సినిమా కోసం బాలయ్య సరికొత్త మేకోవర్‌లో కనిపించబోతున్నారట. వచ్చే నెల మొదటి వారం నుంచి ఫస్ట్ షెడ్యూల్ ప్రారంభించేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మొదట చిత్రీకరించబోయే యాక్షన్ సన్నివేశాల కోసం భారీ సెట్‌ను కూడా సిద్ధం చేస్తున్నారట. అంతేకాదు, తొలి షెడ్యూల్‌లో బాలయ్యకు సంబంధం లేని కొన్ని సన్నివేశాలను చిత్రీకరించనున్నట్లు తెలుస్తోంది.

మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమాలో ఫ్యామిలీ ఎమోషన్స్‌కు కొరటాల శివ ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారట. కథ కూడా చాలా ప్రత్యేకంగా ఉండబోతుందని సమాచారం. ‘దేవర’ తర్వాత కొరటాల శివ తెరకెక్కిస్తున్న సినిమా కావడంతో.. కథ విషయంలో ఆయన ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. మరి బాలయ్య, కొరటాల శివ కాంబినేషన్‌లో రాబోతున్న ఈ సినిమా ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు