పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సతీమణి అన్నా కొణిదెలకు సంబంధించి ప్రస్తుతం ఓ వార్త సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవలే సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన ఆమె.. ఇప్పుడు అకస్మాత్తుగా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌ను డియాక్టివేట్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో అసలు ఆమె ఈ నిర్ణయం ఎందుకు తీసుకున్నారనే చర్చ మొదలైంది.
సాధారణంగా సోషల్ మీడియాకు దూరంగా ఉండే అన్నా కొణిదెల.. 2026 మార్చిలో ఇన్‌స్టాగ్రామ్‌లోకి అడుగుపెట్టారు. అప్పటి నుంచి తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన కొన్ని ప్రత్యేక క్షణాలను అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. దీంతో ఆమె సోషల్ మీడియా అకౌంట్‌పై అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.
అయితే, ఇప్పుడు అకస్మాత్తుగా ఆమె ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ అందుబాటులో లేకపోవడంతో రకరకాల వార్తలు ప్రచారంలోకి వస్తున్నాయి. నెటిజన్ల నుంచి ఎదురైన నెగిటివ్ కామెంట్స్, ఆన్‌లైన్ ట్రోలింగ్ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారనే ప్రచారం జరుగుతోంది.
కానీ, అన్నా కొణిదెల తన అకౌంట్‌ను ఎందుకు డియాక్టివేట్ చేశారనే విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. కాబట్టి ట్రోలింగ్ కారణంగానే ఆమె ఈ నిర్ణయం తీసుకున్నారని ఖచ్చితంగా చెప్పలేం.
మొత్తానికి, అన్నా కొణిదెల ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌కు సంబంధించిన ఈ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది. మరి ఆమె తిరిగి సోషల్ మీడియాలోకి వస్తారా? ఈ విషయంపై ఏమైనా వివరణ ఇస్తారా? అనేది వేచి చూడాలి.








