టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలతోనే కాకుండా వ్యాపార రంగంలోనూ తనదైన ముద్ర వేస్తున్నారు. ఇప్పటికే పలు వ్యాపారాల్లో భాగస్వామిగా కొనసాగుతున్న మహేష్, తాజాగా మరో కొత్త రంగంలోకి అడుగుపెట్టినట్లు వార్తలు వస్తున్నాయి.
ఈసారి ఏకంగా గేమింగ్ బిజినెస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు మహేష్ బాబు. షార్ట్ గన్ గేమ్స్ అనే సంస్థలో భాగస్వామిగా చేరిన ఆయన, ప్రస్తుతం రూపొందుతున్న ‘టేక్ డౌన్ జెనెసిస్’ అనే యాక్షన్ అడ్వెంచర్ గేమ్‌లో భాగమయ్యారు.
పీసీ, కన్సోల్ ప్లాట్‌ఫామ్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ గేమ్‌ను అంతర్జాతీయ స్థాయిలో రూపొందిస్తున్నట్లు సమాచారం. ముఖ్యంగా అమెరికా, యూరప్, బ్రిటన్ వంటి మార్కెట్లలోని గేమర్స్‌ను దృష్టిలో పెట్టుకుని ఈ ప్రాజెక్టును సిద్ధం చేస్తున్నారట.
అయితే ఈ గేమింగ్ ప్రాజెక్టులో మహేష్ బాబు ఎంత పెట్టుబడి పెట్టారు? ఆయన పాత్ర ఏంటి? అనే విషయాలపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
ఇప్పటికే జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్ ద్వారా నిర్మాణ రంగంలో కొనసాగుతున్న మహేష్, ఏషియన్ సినిమాస్‌తో కలిసి మల్టీప్లెక్స్ వ్యాపారంలోనూ అడుగుపెట్టారు. అంతేకాకుండా ఏఎన్ రెస్టారెంట్స్, ఫిట్ డే వంటి వ్యాపారాల్లో కూడా భాగస్వామిగా ఉన్నారు.
ఇలా ఒక్కో రంగంలో తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించుకుంటూ వెళ్తున్న మహేష్ బాబు ఇప్పుడు గేమింగ్ రంగంలోకి రావడం ఆసక్తికరంగా మారింది.
మరోవైపు సినిమాల విషయానికి వస్తే, దర్శకధీరుడు రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వారణాసి’ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
మరి గేమింగ్ రంగంలో మహేష్ బాబు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి!








