Search
Close this search box.

  కంగనా – రవిబాబు కాంబినేషన్‌లో హారర్ సినిమా..? వైరల్ అవుతున్న న్యూస్..!

October 26, 2026 11:45 PM | Aditya369 News

కంగనా – రవిబాబు కాంబినేషన్‌లో హారర్ సినిమా..? వైరల్ అవుతున్న న్యూస్..!

బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ కంగనా రనౌత్.. మరోసారి సినిమా వార్తల్లో హాట్ టాపిక్‌గా మారింది. అయితే ఈసారి ఆమెకు సంబంధించిన వార్త టాలీవుడ్‌లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

టాలీవుడ్ దర్శకుడు రవిబాబు ఓ హారర్ సినిమాను తెరకెక్కిస్తున్నారని, ఈ సినిమాలో కంగనా రనౌత్ హీరోయిన్‌గా నటిస్తున్నారని ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతోంది. అంతేకాదు, ఈ సినిమా షూటింగ్ కూడా రహస్యంగా జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.

అయితే ఈ వార్తలపై ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో అసలు ఈ కాంబినేషన్ నిజమేనా? లేక కేవలం ప్రచారమేనా? అనేది తెలియాల్సి ఉంది.

ఒకవేళ ఈ వార్త నిజమైతే, దాదాపు 17 ఏళ్ల తర్వాత కంగనా రనౌత్ తెలుగు సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది.

మరోవైపు, కంగనా చేతిలో ‘సర్కిల్’, ‘క్వీన్ 2’, ‘తను వెడ్స్ మను 3’ వంటి ప్రాజెక్టులు ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.

మొత్తానికి, రవిబాబు దర్శకత్వంలో కంగనా రనౌత్ హారర్ సినిమా వస్తే మాత్రం ఈ కాంబినేషన్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొనే అవకాశం ఉంది. మరి ఈ వార్తపై మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారో చూడాలి!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore