Search
Close this search box.

  RC17 పై క్రేజీ అప్డేట్..?

October 3, 2026 8:40 PM | Aditya369 News

RC17 పై క్రేజీ అప్డేట్..?

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘RC17’పై ఓ ఇంట్రెస్టింగ్ అప్‌డేట్ ఇప్పుడు ఫిలిం నగర్‌లో చక్కర్లు కొడుతోంది.

ఈ సినిమాకు డిసెంబర్‌లో తొలి షెడ్యూల్ ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. అయితే షూటింగ్ మొదలుకాకముందే చిత్రబృందం ఓ పక్కా డెడ్‌లైన్‌ను ఫిక్స్ చేసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది.

అదేంటంటే.. డిసెంబర్ 2027 నాటికి, అంటే దాదాపు ఏడాది వ్యవధిలోనే ‘RC17’ మొత్తం షూటింగ్‌ను పూర్తి చేయాలని మేకర్స్ టార్గెట్ పెట్టుకున్నారట.

రామ్ చరణ్ లాంటి స్టార్ హీరోతో తెరకెక్కే భారీ సినిమాలకు భారీ యాక్షన్ సీక్వెన్స్‌లు, వివిధ లొకేషన్స్, ఆర్టిస్టుల డేట్స్ వంటి కారణాలతో షూటింగ్ ఎక్కువ సమయం తీసుకోవడం సహజం. కానీ ఈసారి సుకుమార్ మాత్రం ముందుగానే పక్కా ప్లానింగ్ చేసుకుని షూటింగ్‌ను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని చూస్తున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ అనుకున్న టైమ్‌కి షూటింగ్ పూర్తయితే.. పోస్ట్ ప్రొడక్షన్ పనులకు కూడా మేకర్స్‌కు కావాల్సినంత సమయం దొరుకుతుంది. దీంతో సినిమా రిలీజ్ విషయంలో చివరి నిమిషంలో ఎలాంటి హడావుడి లేకుండా ప్లాన్ చేసుకునే అవకాశం ఉంటుంది.

మరి సుకుమార్ పెట్టుకున్న ఈ డెడ్‌లైన్ ప్రకారం ‘RC17’ షూటింగ్ నిజంగానే ఏడాదిలో పూర్తవుతుందా? అనేది చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు