మాస్ మహారాజా రవితేజ నటించిన ‘ఇరుముడి’ సినిమా థియేట్రికల్ రన్‌ను పూర్తి చేసుకుంది. ట్రేడ్ వర్గాల అంచనాల ప్రకారం ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.250 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ సాధించినట్లు తెలుస్తోంది.
ఇక తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా దాదాపు రూ.194 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. రూ.200 కోట్ల మార్క్‌కు చాలా దగ్గరగా వెళ్లినప్పటికీ.. ఓటీటీలో స్ట్రీమింగ్ ప్రారంభం కావడంతో థియేటర్లలో రన్ తగ్గిపోయి ఆ మైలురాయిని మాత్రం అందుకోలేకపోయింది.
అయితే ‘ఇరుముడి’ అసలు సెన్సేషన్ కలెక్షన్స్‌లో కంటే ఫుట్‌ఫాల్స్‌లో కనిపిస్తోంది. ఏపీ, తెలంగాణలో ఈ సినిమా దాదాపు 1.45 కోట్ల టికెట్లను విక్రయించినట్లు ట్రేడ్ అంచనాలు చెబుతున్నాయి.
ముఖ్యంగా సాధారణ టికెట్ ధరలతో విడుదలైన ‘ఇరుముడి’.. భారీ టికెట్ రేట్లతో వచ్చిన ‘పుష్ప 2’ సుమారు 1.50 కోట్ల టికెట్ సేల్స్‌కు అత్యంత దగ్గరగా వెళ్లడం విశేషం.
మొత్తంగా రూ.250 కోట్ల గ్రాస్‌తో పాటు భారీ స్థాయిలో టికెట్ సేల్స్ సాధించి.. రవితేజకు ఉన్న మాస్ క్రేజ్ ఏ రేంజ్లో ఉందో ‘ఇరుముడి’ మరోసారి చూపించిందనే చెప్పాలి.







