శ్రీను వైట్ల – శర్వానంద్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న క్రేజీ మూవీ ‘జార్జ్ క్రిష్’. ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉండగా.. తాజాగా శర్వానంద్, హీరోయిన్ మానస వారణాసి మధ్య ఉండే లవ్ ట్రాక్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలు బయటకు వస్తున్నాయి.
ఈ సినిమాలో శర్వానంద్, మానస వారణాసి లవ్ స్టోరీ చాలా ట్రెండీగా ఉండటమే కాకుండా.. ఫుల్ ఫన్ టచ్‌తో సాగుతుందని సమాచారం. రెగ్యులర్ లవ్ స్టోరీస్‌కి భిన్నంగా.. నేటి జనరేషన్ ఆలోచనా విధానం, రిలేషన్‌షిప్ గోల్స్, సోషల్ మీడియా ప్రభావం వంటి అంశాలను ఈ లవ్ ట్రాక్‌లో టచ్ చేయబోతున్నారట.
అంతేకాదు.. హీరో, హీరోయిన్ మధ్య కెమిస్ట్రీతో పాటు ఇద్దరి మధ్య జరిగే ఫన్నీ కన్వర్సేషన్స్, చిన్న చిన్న గొడవలు, డ్రామా సినిమాకు మంచి ఎంటర్టైన్మెంట్‌ను తీసుకురానున్నాయట. ముఖ్యంగా వీరిద్దరి లవ్ ట్రాక్ సినిమాలో హైలైట్‌గా నిలిచేలా శ్రీను వైట్ల తన మార్క్ కామెడీని జోడిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక ఈ సినిమాలో శర్వానంద్ ఓ జూనియర్ సైంటిస్ట్ పాత్రలో కనిపించబోతున్నాడట. హీరో క్యారెక్టర్ చుట్టూ సాగే డ్రామా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉండటంతో పాటు.. సినిమాలోని కొన్ని ఎపిసోడ్స్ ఫుల్ ఎంటర్టైనింగ్‌గా ఉండనున్నాయని సమాచారం.
మరోవైపు ఈ సినిమాను సంక్రాంతి బరిలో నిలిపేందుకు మేకర్స్ గట్టిగానే ప్రయత్నాలు చేస్తున్నారట. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఏడాది జనవరి 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని ప్లాన్ చేస్తున్నారు.
అనూప్ రూబెన్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. మరి శర్వానంద్ – శ్రీను వైట్ల కాంబినేషన్ సంక్రాంతి సీజన్‌లో ఎలాంటి ఎంటర్టైన్మెంట్ అందిస్తుందో చూడాలి.








