ఎన్టీఆర్ – త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కనున్న భారీ మైథలాజికల్ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే అధికారిక ప్రకటన వచ్చిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్‌కు సంబంధించి ఇప్పుడు ఓ క్రేజీ అప్డేట్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది.
లేటెస్ట్ సమాచారం ప్రకారం.. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఏడాది జనవరి చివరి వారం నుంచి ప్రారంభించేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అప్పటివరకు దర్శకుడు త్రివిక్రమ్ స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ-ప్రొడక్షన్ పనులు, విజువల్ డిజైన్‌పై పూర్తిగా ఫోకస్ చేయనున్నారట.
మరోవైపు ఎన్టీఆర్ ప్రస్తుతం ‘డ్రాగన్’ సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్నారు. ఆ సినిమా షూటింగ్ పూర్తయిన తర్వాతే త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్నట్లు సమాచారం.
ఇక ఈ సినిమా మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనుండటంతో భారీ యాక్షన్ సీక్వెన్సులతో పాటు విజువల్ ఎఫెక్ట్స్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయట. ముఖ్యంగా ఎన్టీఆర్‌ను ఒక దేవుడి పాత్రలో చూపించబోతున్నారనే వార్త ఈ ప్రాజెక్ట్‌పై అంచనాలను మరింత పెంచుతోంది.
ఇందులో తారక్.. శివుడి కుమారుడు, పార్వతీదేవి గర్వకారకుడైన సుబ్రహ్మణ్య స్వామి పాత్రలో కనిపించనున్నట్లు సమాచారం. అందుకే ఎన్టీఆర్ లుక్, గెటప్ విషయంలో త్రివిక్రమ్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారట. తారక్ లుక్‌ను మరింత గ్రాండ్‌గా చూపించేందుకు స్పెషల్ VFX వర్క్ కూడా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది.
ఇక తన కెరీర్‌లోనే భారీ ప్రాజెక్ట్‌గా తెరకెక్కే అవకాశం ఉండటంతో.. ప్రతి విషయంలోనూ త్రివిక్రమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అంతేకాదు, మైథలాజికల్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను తన డ్రీమ్ ప్రాజెక్ట్‌గా త్రివిక్రమ్ భావిస్తున్నట్లు తెలుస్తోంది.
మరి త్రివిక్రమ్ – ఎన్టీఆర్ కాంబినేషన్ ఈసారి ఎలాంటి విజువల్ వండర్‌ను చూపించబోతుందో చూడాలి.
ఈ చిత్రాన్ని హారికా అండ్ హాసిని క్రియేషన్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లపై ఎస్. రాధాకృష్ణ, నందమూరి కళ్యాణ్ రామ్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.








