మెగాస్టార్ చిరంజీవి హీరోగా, దర్శకుడు కొల్లి బాబీ తెరకెక్కిస్తున్న క్రేజీ యాక్షన్ డ్రామా ‘కాకా’పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.
ప్రస్తుతం ఈ సినిమా పనులు జెట్ స్పీడ్‌లో జరుగుతున్నాయి. ఇక రిలీజ్ విషయంలో కూడా మేకర్స్ పక్కా క్లారిటీతో ఉన్నట్లు తెలుస్తోంది.
తాజాగా ‘కాకా’ డబ్బింగ్ పనులు కూడా ప్రారంభించినట్లు మేకర్స్ అధికారికంగా వెల్లడించారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాల వీడియోను కూడా విడుదల చేశారు.
దీంతో సినిమా అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రావడం దాదాపు ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి.
ఇక ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ అనశ్వర రంజన్ కీలక పాత్రలో నటిస్తుండగా.. థమన్ సంగీతం అందిస్తున్నాడు.
కేవీఎన్ ప్రొడక్షన్స్ తెలుగులో నిర్మిస్తున్న తొలి చిత్రంగా భారీ స్థాయిలో తెరకెక్కుతున్న ‘కాకా’.. జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.
మరి చిరంజీవి–బాబీ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో చూడాలి!








