అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య ప్రస్తుతం ‘విరూపాక్ష’ ఫేమ్ కార్తీక్ దండు దర్శకత్వంలో ‘వృషకర్మ’ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. మైథలాజికల్, సూపర్ నేచురల్, ఫాంటసీ, పీరియడ్ యాక్షన్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే మంచి అంచనాలు ఉన్నాయి.
వాస్తవానికి ‘వృషకర్మ’ను దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ భావించారు. అయితే కొన్ని కారణాల వల్ల సినిమా విడుదల వాయిదా పడింది. తాజాగా ఈ మూవీ రిలీజ్ డేట్‌పై చిత్రబృందం అధికారిక ప్రకటన చేసింది.
డిసెంబర్ 4న ‘వృషకర్మ’ థియేటర్లలోకి రానున్నట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో నాగచైతన్య అభిమానుల్లో ఈ మూవీపై ఆసక్తి మరింత పెరిగింది. అయితే ఇదే సమయంలో ప్రభాస్ అభిమానులకు మాత్రం ఈ రిలీజ్ డేట్ కాస్త షాక్ ఇచ్చింది.
ఎందుకంటే ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ సినిమా డిసెంబర్ 3న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కావాల్సి ఉంది. అయితే గత కొంతకాలంగా ఈ సినిమా వాయిదా పడే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీనిపై ఇప్పటివరకు మేకర్స్ నుంచి ఎలాంటి అధికారిక క్లారిటీ రాలేదు.
అయితే ఇప్పుడు నాగచైతన్య ‘వృషకర్మ’ డిసెంబర్ 4న విడుదల కానున్నట్లు ప్రకటించడంతో ‘ఫౌజీ’ రిలీజ్‌పై మళ్లీ చర్చ మొదలైంది. ప్రభాస్ లాంటి పాన్ ఇండియా స్టార్ సినిమా విడుదలైన మరుసటి రోజే ‘వృషకర్మ’ను రిలీజ్ చేయడం అంటే రెండు సినిమాలకు భారీ పోటీ తప్పదు.
అందుకే ‘ఫౌజీ’ వాయిదా పడటం దాదాపు ఖాయమైందనే టాక్ ఇండస్ట్రీలో వినిపిస్తోంది. ప్రభాస్ సినిమా అనుకున్న తేదీకే వస్తే, దానికి కేవలం ఒక్క రోజు గ్యాప్‌లో నాగచైతన్య సినిమాను విడుదల చేసే సాహసం మేకర్స్ చేసే అవకాశం తక్కువ.
దీంతో ‘వృషకర్మ’ రిలీజ్ డేట్ ప్రకటన వెనుక ‘ఫౌజీ’ వాయిదా కూడా ఒక కారణమై ఉండొచ్చనే ప్రచారం జరుగుతోంది. మరి ప్రభాస్ ‘ఫౌజీ’ నిజంగానే వాయిదా పడుతుందా? లేక రెండు సినిమాలు వరుసగా థియేటర్లలోకి వస్తాయా? అనేది అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.









