ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ పాన్ ఇండియా మూవీ ‘వారణాసి’. మహేష్ బాబు, ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌పై ఇప్పటికే దేశవ్యాప్తంగా భారీ అంచనాలు నెలకొన్నాయి. తాజా సమాచారం ప్రకారం ‘వారణాసి’ షూటింగ్ దాదాపు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఇప్పటికే 90 శాతానికి పైగా షూటింగ్ పూర్తయినట్లు రిపోర్టులు వస్తుండగా.. మహేష్ బాబు తనకు సంబంధించిన కీలకమైన షూటింగ్ భాగాలను కూడా దాదాపుగా పూర్తి చేసినట్లు సమాచారం. ప్రస్తుతం మరికొన్ని సీన్స్‌తో పాటు ఒక సాంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నట్లు తెలుస్తోంది.
మహేష్ బాబు మరో 20 రోజుల పాటు షూటింగ్‌లో పాల్గొంటే ఆయనకు సంబంధించిన పెండింగ్ వర్క్ పూర్తయ్యే అవకాశం ఉందట. ఆ తర్వాత ‘వారణాసి’ పూర్తిగా పోస్ట్ ప్రొడక్షన్ దశలోకి వెళ్లనుందని ఇండస్ట్రీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
వీఎఫ్ఎక్స్, ఎడిటింగ్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, ఇతర పోస్ట్ ప్రొడక్షన్ పనులకు భారీ సమయం అవసరం కావడంతో.. అక్టోబర్ నుంచి ఫిబ్రవరి వరకు ఈ పనులను పూర్తి చేసేలా మేకర్స్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.
ఇక మార్చి నెల మొత్తం ‘వారణాసి’ ప్రమోషన్స్‌పైనే ఫోకస్ చేయాలని రాజమౌళి అండ్ టీమ్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. హాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ నిర్వహించి సినిమాపై ఉన్న హైప్‌ను మరింత పెంచాలని చూస్తున్నారట.
అన్నీ అనుకున్నట్లుగానే జరిగితే ఈ నెలాఖరుకల్లా షూటింగ్ పూర్తిచేసి.. వెంటనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతం చేయనున్నట్లు తెలుస్తోంది. దీంతో 2027 ఏప్రిల్‌లో ‘వారణాసి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చే టార్గెట్‌పై టీమ్ మరింత ఫోకస్ పెట్టినట్లు సమాచారం.









