Search
Close this search box.

  సూర్య 47 నుంచి అదిరిపోయే అప్డేట్..!

September 9, 2026 8:18 AM | Aditya369 News

సూర్య 47 నుంచి అదిరిపోయే అప్డేట్..!

తమిళ స్టార్ హీరో సూర్య వరుస విజయాలతో జోరు మీదున్నారు. తాజాగా ‘విశ్వనాథ్ అండ్ సన్స్’తో మంచి విజయాన్ని అందుకున్న ఆయన.. ఇప్పుడు తన 47వ సినిమాపై ఫోకస్ పెట్టారు. ‘ఆవేశం’ ఫేమ్ జిత్తు మాధవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి మేకర్స్ క్రేజీ అప్డేట్ ఇచ్చారు. సెప్టెంబర్ 9 సాయంత్రం 6 గంటలకు ‘సూర్య 47’ నుంచి కీలకమైన అప్డేట్‌ను విడుదల చేయనున్నట్లు అధికారికంగా ప్రకటించారు. “ది వన్ ఎంట్రీ” అంటూ టీమ్ చేసిన ప్రకటనతో అసలు ఆ అప్డేట్ ఏంటనే ఆసక్తి అభిమానుల్లో మరింత పెరిగింది.

ఈ సినిమాలో సూర్య పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నట్లు ఇప్పటికే వార్తలు వినిపిస్తున్నాయి. మలయాళ నటి నజ్రియా, ‘ప్రేమలు’ ఫేమ్ నస్లెన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. సుషిన్ శ్యామ్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సూర్యకు చెందిన 2D ఎంటర్‌టైన్‌మెంట్స్, ఝగరం స్టూడియోస్ నిర్మిస్తున్నాయి.

ఇప్పటికే సినిమా షూటింగ్ పూర్తయినట్లు మేకర్స్ ప్రకటించారు. దీంతో సెప్టెంబర్ 9న రాబోయే అప్డేట్‌పై మరింత ఆసక్తి నెలకొంది. ఇది ఫస్ట్ లుక్‌నా, టైటిల్ టీజరా, లేక మరో సర్‌ప్రైజ్‌నా అన్నది సాయంత్రం 6 గంటలకు తేలనుంది.

ఇక ఈ సినిమా టైటిల్ ‘Scene’ అంటూ కొన్ని కథనాలు వస్తున్నప్పటికీ, దీనిపై అధికారికంగా మేకర్స్ నుంచి ఇంకా స్పష్టత రాలేదు. కాబట్టి టైటిల్‌తో పాటు సూర్య లుక్ ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలంటే మరికొద్ది గంటలు వేచి చూడాల్సిందే.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు