బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ఆలియా భట్ టాలీవుడ్లో తన క్రేజ్‌ను మరింత పెంచుకునే దిశగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు మరోసారి టాలీవుడ్‌లోని భారీ ప్రాజెక్ట్‌లపై ఫోకస్ పెట్టినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.
ప్రస్తుతం ఆలియా భట్ పేరు రెండు ప్రతిష్టాత్మక పాన్ ఇండియా సినిమాలతో ముడిపడి ఉంది. అందులో ఒకటి ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కిన కల్కి 2898 ఏడీ సీక్వెల్ కాగా.. మరొకటి యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం.
కల్కి 2898 ఏడీ సీక్వెల్లో దీపికా పదుకొనే స్థానంలో ఆలియా భట్‌ను తీసుకునే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్లు కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన చర్చలు జరుగుతున్నాయని, అయితే ఇప్పటివరకు చిత్రబృందం ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. ప్రభాస్ ఇతర సినిమాలతో బిజీగా ఉండటంతో సీక్వెల్ పనులు కొంత ఆలస్యమవుతున్నట్లు సమాచారం. త్వరలోనే ఈ సినిమాకు సంబంధించిన కీలక అప్డేట్ వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది.
ఇక ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాకు సంబంధించి కూడా ఆలియా భట్ పేరు వినిపిస్తోంది. ఈ చిత్రానికి ప్రస్తుతం డ్రాగన్ అనే వర్కింగ్ టైటిల్ ప్రచారంలో ఉంది. ఇందులో ఆలియా కీలక పాత్రలో నటించే అవకాశం ఉందని, ఆమెతో మేకర్స్ చర్చలు జరుపుతున్నారని సమాచారం. ప్రస్తుతం ఈ చర్చలు తుది దశకు చేరుకున్నట్లు తెలుస్తోంది.
ఈ రెండు ప్రాజెక్ట్‌లు అధికారికంగా ఖరారైతే ఆలియా భట్‌కు టాలీవుడ్లో మరోసారి భారీ అవకాశాలు దక్కినట్లే. ఇప్పటికే ఆర్ఆర్ఆర్తో తెలుగు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె.. ఇప్పుడు ప్రభాస్, ఎన్టీఆర్ వంటి స్టార్ హీరోలతో కలిసి భారీ పాన్ ఇండియా సినిమాల్లో నటిస్తే ఆమెకు సౌత్‌లో మరింత క్రేజ్ పెరిగే అవకాశం ఉంది.
అయితే కల్కి 2898 ఏడీ సీక్వెల్‌తో పాటు ఎన్టీఆర్–ప్రశాంత్ నీల్ సినిమాల్లో ఆలియా భట్ నటిస్తుందనే వార్తలపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. దీంతో ఈ రెండు క్రేజీ ప్రాజెక్ట్‌ల విషయంలో అసలు నిజం ఏంటో తెలియాలంటే చిత్రబృందాల అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.









