Search
Close this search box.

  యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్..! అక్కడైనా సక్సెస్ అయ్యేనా..?

September 3, 2026 6:59 PM | Aditya369 News

యశ్ ‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్ రిలీజ్ డేట్ ఫిక్స్..! అక్కడైనా సక్సెస్ అయ్యేనా..?

కన్నడ రాకింగ్ స్టార్ యశ్ ప్రధాన పాత్రలో గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో తెరకెక్కిన పాన్ ఇండియా చిత్రం ‘టాక్సిక్’. భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో యశ్ సరికొత్త లుక్, క్యారెక్టర్‌లో కనిపించారు. కన్నడతో పాటు ఇంగ్లీష్ భాషలోనూ ఈ సినిమాను తెరకెక్కించినట్లు మేకర్స్ ముందుగానే ప్రకటించారు.

అయితే ఇతర భాషల్లో సినిమా విడుదలైనప్పటికీ ఇంగ్లీష్ వెర్షన్ మాత్రం కొన్ని కారణాల వల్ల ఆలస్యమైంది. తాజాగా ఈ వెర్షన్ విడుదలకు సంబంధించిన కీలక అప్డేట్‌ను కేవీఎన్ ప్రొడక్షన్స్ ప్రకటించింది.

ఇంగ్లీష్ వెర్షన్ రేపే విడుదల

‘టాక్సిక్’ ఇంగ్లీష్ వెర్షన్‌ను సెప్టెంబర్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నట్లు కేవీఎన్ ప్రొడక్షన్స్ అధికారికంగా వెల్లడించింది. దీంతో ఇంగ్లీష్ వెర్షన్ కోసం ఎదురుచూస్తున్న యశ్ అభిమానుల్లో ఆసక్తి నెలకొంది.

ఈ సినిమా నిర్మాణంలో అంతర్జాతీయ నిర్మాణ సంస్థ లయన్స్‌గేట్ కూడా భాగస్వామిగా ఉంది. పాన్ ఇండియా మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకుని ఇంగ్లీష్ వెర్షన్‌ను రూపొందించారు.

ఇక తెలుగు సహా ఇతర భాషల్లో ‘టాక్సిక్’ రన్‌టైమ్ సుమారు 3 గంటల 14 నిమిషాలుగా ఉంది. అయితే ఇంగ్లీష్ వెర్షన్‌లో నిడివిని కొంత తగ్గించినట్లు తెలుస్తోంది. ఇతర భాషల్లో ఆశించిన స్థాయిలో స్పందన రాకపోయినప్పటికీ ఇంగ్లీష్ వెర్షన్ ద్వారా అంతర్జాతీయ ప్రేక్షకులను ఆకట్టుకుంటుందా అనే ఆసక్తి నెలకొంది.

భారీ బడ్జెట్.. డల్ కలెక్షన్స్

‘టాక్సిక్’ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. సుమారు రూ.500 కోట్ల బడ్జెట్‌తో రూపొందిన ఈ సినిమా ఆగస్టు 26న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మొదటి రోజున మంచి ఓపెనింగ్ సాధించినప్పటికీ సినిమాకు మిక్స్‌డ్ టాక్ రావడంతో తర్వాతి రోజుల్లో వసూళ్లు భారీగా తగ్గినట్లు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి.

విడుదలైన దాదాపు వారం రోజుల్లో ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా సుమారు రూ.313.55 కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు సమాచారం. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమాకు ఈ స్థాయి వసూళ్లు సరిపోతాయా అనే చర్చ జరుగుతోంది.

ఇక ఇంగ్లీష్ వెర్షన్ విడుదలతో సినిమాకు మరోసారి కలెక్షన్లు పెరిగే అవకాశం ఉందని అభిమానులు ఆశిస్తున్నారు. మరి ఇంగ్లీష్ వెర్షన్ అయినా ప్రేక్షకులను మెప్పించి ‘టాక్సిక్’ను బ్రేక్ ఈవెన్ దిశగా తీసుకెళ్తుందా? అనేది చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు