Search
Close this search box.

  స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ..! ఫేక్ కాస్టింగ్ మోసాలకు చెక్.. !

September 3, 2026 6:58 PM | Aditya369 News

స్కామ్ పై కల్కి 2 టీమ్ క్లారిటీ..! ఫేక్ కాస్టింగ్ మోసాలకు చెక్.. !

సినిమా ఇండస్ట్రీలో ఒక సినిమా షూటింగ్ జరుగుతుందంటే నటీనటులు, టెక్నీషియన్ల కోసం కాస్టింగ్ కాల్స్ రావడం సాధారణమే. అయితే ఇదే అదునుగా భావించి కొంతమంది ఫేక్ కాస్టింగ్ కాల్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ఘటనలు తరచూ వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ వైజయంతి మూవీస్ బ్యానర్ పేరుతో కూడా ఇలాంటి ఫేక్ కాస్టింగ్ కాల్స్ జరుగుతున్న నేపథ్యంలో నిర్మాణ సంస్థ స్పందించి కీలక హెచ్చరికలు జారీ చేసింది.

వైజయంతి మూవీస్ బ్యానర్ నుంచి ఇప్పటివరకు ఎన్నో ప్రతిష్టాత్మక సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కల్కి 2 సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కల్కి 2 కోసం ఆడిషన్స్ జరుగుతున్నాయంటూ సోషల్ మీడియాలో కొన్ని వార్తలు ప్రచారం అవుతున్నాయి. దీంతో వైజయంతి మూవీస్ సంస్థ అధికారికంగా స్పందించింది.

తమ తరఫున ఆడిషన్స్ లేదా కాస్టింగ్ నిర్వహించేందుకు ఎలాంటి థర్డ్ పార్టీ ఏజెన్సీ, కంపెనీ, వ్యక్తి లేదా కాస్టింగ్ ప్రతినిధికి అనుమతి ఇవ్వలేదని నిర్మాణ సంస్థ స్పష్టం చేసింది. తమ సంస్థకు ప్రాతినిథ్యం వహిస్తున్నామని ఎవరైనా చెబితే వారి మాటలను నమ్మవద్దని సూచించింది.

అలాగే వ్యక్తిగత వివరాలు, ఆడిషన్ మెటీరియల్ లేదా ఇతర ముఖ్యమైన సమాచారాన్ని అలాంటి వ్యక్తులతో పంచుకోవద్దని, ముఖ్యంగా ఎలాంటి చెల్లింపులు చేయవద్దని వైజయంతి మూవీస్ హెచ్చరించింది. తమ సంస్థ పేరును అధికారికంగా ఉపయోగిస్తూ మోసాలకు పాల్పడే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేసింది.

కాస్టింగ్‌కు సంబంధించిన ఏదైనా అధికారిక సమాచారం తెలుసుకోవాలంటే వైజయంతి మూవీస్ అధికారిక సోషల్ మీడియా ఖాతాలను మాత్రమే సంప్రదించాలని నిర్మాణ సంస్థ సూచించింది. ఫేక్ కాస్టింగ్ కాల్స్‌ను నమ్మి ఎవరూ మోసపోవద్దని పేర్కొంది.

ఇక కల్కి 2 సినిమా విషయానికొస్తే.. ప్రభాస్ హీరోగా, నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ ప్రారంభమై కొంత భాగం పూర్తి చేసినట్లు సమాచారం. ప్రభాస్ ప్రస్తుతం ఇతర సినిమాల కమిట్మెంట్స్‌తో బిజీగా ఉండటంతో తదుపరి షెడ్యూల్‌పై ఆసక్తి నెలకొంది. ప్రభాస్ డేట్స్ అందుబాటులోకి వచ్చిన వెంటనే షూటింగ్‌ను కొనసాగించనున్నట్లు తెలుస్తోంది.

2024లో విడుదలైన కల్కి 2898 ఏడీ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకోవడంతో పాటు ప్రపంచవ్యాప్తంగా భారీ వసూళ్లు సాధించింది. దీంతో ఇప్పుడు కల్కి 2పై ప్రేక్షకుల్లో, ముఖ్యంగా ప్రభాస్ అభిమానుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore