Search
Close this search box.

  ‘రోమాంచకం’ మూవీ రివ్యూ..! కామెడీతో ఆకట్టుకుందా..?

September 3, 2026 6:50 PM | Aditya369 News

‘రోమాంచకం’ మూవీ రివ్యూ..! కామెడీతో ఆకట్టుకుందా..?

పాన్ ఇండియా దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నిర్మాణ సంస్థ భద్రకాళి క్రియేషన్స్‌పై తెరకెక్కిన చిత్రం ‘రోమాంచకం’. సుమంత్ ప్రభాస్‌, అనంతిక సనీల్‌కుమార్‌ జంటగా నటించిన ఈ సినిమాకు వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వం వహించారు. ప్రచార చిత్రాలతో మంచి బజ్ తెచ్చుకున్న ఈ సినిమా ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో చూద్దాం.

కథ విషయానికొస్తే.. అన్వేష్ తన స్నేహితులతో కలిసి స్టార్టప్ కంపెనీ ప్రారంభించేందుకు ప్రయత్నిస్తుంటాడు. అందులో భాగంగా ‘రోమాంచకం’ పేరుతో ఓ డేటింగ్ యాప్‌ను రూపొందిస్తాడు. ఈ యాప్ ద్వారా చెన్నైకి చెందిన మైథిలితో పరిచయం ఏర్పడుతుంది. ఆ పరిచయం ప్రేమగా మారడంతో ఆమెను సర్‌ప్రైజ్ చేసేందుకు అన్వేష్ చెన్నై వెళ్తాడు. కానీ మైథిలి అతడిని కలవకుండా ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి, సోషల్ మీడియాలో బ్లాక్ చేస్తుంది. అసలు ఆమె ఎందుకు కనిపించకుండా పోయింది? ఈ ఇద్దరి ప్రేమకథ చివరకు ఎక్కడికి చేరింది? అనేదే మిగతా కథ.

దర్శకుడు ప్రేమ, హాస్యం, ఉత్కంఠ అంశాలను మిక్స్ చేసినప్పటికీ కామెడీకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాడు. హీరో స్టార్టప్ కథతో సినిమా మొదలైనా తర్వాత దాని ప్రస్తావన పెద్దగా కనిపించదు. హీరో, హీరోయిన్ మధ్య కొన్ని సన్నివేశాలు లాజిక్‌కు దూరంగా అనిపిస్తాయి. ప్రేమ, థ్రిల్లింగ్ అంశాలు ఆశించిన స్థాయిలో ఆకట్టుకోవు.

అయితే ఈ లోపాలను కామెడీ సన్నివేశాలు బాగా కవర్ చేస్తాయి. జెన్‌జీ యువత అల్లరి, ఫ్రెండ్స్ మధ్య సరదా సంభాషణలు, సాంబార్‌, బిర్యానీ, మటన్ వంటి రీజనల్ కామెడీ డైలాగులు ప్రేక్షకులను నవ్విస్తాయి. ఫస్టాఫ్ సరదాగా సాగుతూ చిన్న ఉత్కంఠతో ముగుస్తుంది. సెకండాఫ్‌లోనూ దర్శకుడు థ్రిల్ కంటే కామెడీపైనే ఎక్కువగా దృష్టి పెట్టాడు.

నటీనటుల విషయానికి వస్తే.. సుమంత్ ప్రభాస్ తన పాత్రలో ఈజ్ చూపించాడు. కామెడీ, ఫ్రస్ట్రేషన్ సన్నివేశాల్లో ఆకట్టుకున్నప్పటికీ నటనలో మరింత మెరుగుపడాల్సిన అవసరం ఉంది. అనంతిక సనీల్‌కుమార్ స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. వీరిద్దరి జోడీ కూడా క్యూట్‌గా అనిపిస్తుంది. హీరో ఫ్రెండ్స్‌గా నటించిన వెంకటేష్‌, నరేంద్ర రవి, మణి, సోహన్ మంచి వినోదాన్ని అందించారు. ముఖ్యంగా నరేంద్ర రవి నటన, అతడి డైలాగులు సినిమాకు అదనపు బలంగా నిలిచాయి.

ఓవరాల్‌గా.. ‘రోమాంచకం’లో కథ, లాజిక్‌, ట్విస్టుల కంటే కామెడీకే ఎక్కువ ప్రాధాన్యత ఉంది. ప్రేమ, ఉత్కంఠ అంశాలను కూడా బలంగా చూపించి ఉంటే సినిమా మరింత గ్రిప్పింగ్‌గా ఉండేది. అయితే కేవలం నవ్వులు, వినోదం కోసం సినిమా చూడాలనుకునే వారికి ‘రోమాంచకం’ మంచి టైమ్‌పాస్ ఎంటర్‌టైనర్‌గా నిలుస్తుంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు