పదమూడేళ్ల క్రితం రైల్ రోకో సందర్భంగా తనపై నమోదైన కేసును కొట్టివేయాలని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. 2011లో రైల్ రోకో సందర్భంగా తనపై తప్పుడు కేసు పెట్టారని అందులో పేర్కొన్నారు. తనను 15వ నిందితుడిగా చేర్చారన్నారు. తాను రైల్ రోకోలో పాల్గొనలేదని తెలిపారు. కాబట్టి ప్రజాప్రతినిధుల కోర్టులో తనపై ఉన్న కేసును కొట్టివేయాలని పిటిషన్లో పేర్కొన్నారు. ఈ పిటిషన్పై హైకోర్టు రేపు విచారణ జరపనుంది.
