Search
Close this search box.

  ‘వారణాసి’లో ఇలాంటి సీన్ ఉందా..? ఊహించుకుంటేనే గూస్ బంప్స్..?

August 12, 2026 9:38 PM | Aditya369 News

‘వారణాసి’లో ఇలాంటి సీన్ ఉందా..? ఊహించుకుంటేనే గూస్ బంప్స్..?

మందాకిని చుట్టూ ఒక్కసారిగా గందరగోళం.. భారీ సంఖ్యలో బుల్స్ ఆమె వైపు దూసుకొస్తున్నాయి. చేతిలో ఎర్రటి పొడవైన జెండా పట్టుకుని మహేష్‌కు సిగ్నల్ ఇస్తూ కనిపిస్తోంది. అదే సమయంలో బైనాక్యులర్‌లో ఆమెను గమనించిన రుద్ర.. గుర్రంపై దూసుకొచ్చి మందాకినిని కాపాడతాడు.

ఈ సీన్ చూస్తే నిజంగానే గూస్‌బంప్స్ రావాల్సిందే. రుద్ర లుక్, గుర్రం పరుగులు, యాక్షన్ సీక్వెన్స్.. అన్నీ చూస్తుంటే ఏదో సినిమాలోని ఒరిజినల్ ఫుటేజ్‌లా అనిపిస్తోంది. అందుకే ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.

అయితే ఈ వీడియో విషయంలో అసలు ట్విస్ట్ ఏంటంటే.. ఇది రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా నుంచి లీకైన ఫుటేజ్ కాదు.

సినిమా కథ, కీలక సన్నివేశాలు బయటకు రాకుండా రాజమౌళి టీమ్ చాలా జాగ్రత్తలు తీసుకుంటోంది. అధికారికంగా కూడా పెద్దగా అప్‌డేట్స్ ఇవ్వకపోవడంతో అభిమానులు తమ ఊహలకు పదును పెడుతున్నారు.

రుద్ర ఎలా కనిపిస్తాడు? మందాకినితో అతని ప్రయాణం ఎలా ఉంటుంది? సినిమాలో ఎలాంటి యాక్షన్ సన్నివేశాలు ఉండబోతున్నాయి? అనే ఊహలతో ఫ్యాన్స్ సొంతంగా వీడియోలు రూపొందిస్తున్నారు.

అలాంటి ఫ్యాన్ మేడ్ వీడియోల్లో భాగంగానే ఈ వీడియో కూడా సోషల్ మీడియాలోకి వచ్చింది. అయితే దీన్ని చూస్తే మాత్రం ఫ్యాన్ మేడ్ వీడియో అని అసలు అనిపించదు.

రుద్ర గుర్రంపై దూసుకెళ్లే సీన్, యాక్షన్, విజువల్స్ అన్నీ చాలా సహజంగా ఉండటంతో చాలామంది ఇది నిజంగానే ‘వారణాసి’ నుంచి లీకైన ఫుటేజ్ అని భావించారు.

కానీ నిజానికి ఇది AI టెక్నాలజీతో రూపొందించిన ఫ్యాన్ మేడ్ వీడియో.

ప్రస్తుతం AI టెక్నాలజీ ఏ స్థాయికి చేరుకుందో చెప్పడానికి ఈ వీడియోనే ఒక ఉదాహరణ. ఒకప్పుడు ఫ్యాన్స్ సినిమాలకు సంబంధించిన పోస్టర్లు, ఫొటోలు మాత్రమే క్రియేట్ చేసేవారు. ఇప్పుడు ఏకంగా సినిమాలోని ఒరిజినల్ సీన్‌లా కనిపించే వీడియోలను కూడా రూపొందిస్తున్నారు.

దీంతో అసలు సినిమా నుంచి వచ్చిన కంటెంట్ ఏది? ఫ్యాన్స్ క్రియేట్ చేసిన కంటెంట్ ఏది? అనేది గుర్తించడం కూడా కష్టంగా మారుతోంది.

ఇప్పటికే మహేష్ బాబును రాముడి తరహా లుక్‌లో చూపిస్తూ రూపొందించిన AI విజువల్స్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇక ‘వారణాసి’ విషయానికి వస్తే.. సూపర్‌స్టార్ మహేష్ బాబు, ప్రియాంక చోప్రా జోనస్ కాంబినేషన్‌లో రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి.

టైమ్ ట్రావెల్, అడ్వెంచర్, యాక్షన్‌తో పాటు పురాణ అంశాలు కూడా సినిమాలో ఉండబోతున్నాయనే ప్రచారం ఇప్పటికే సినిమాపై ఆసక్తిని పెంచుతోంది.

మహేష్ బాబు ‘రుద్ర’ పాత్రలో కనిపించనున్నాడనే విషయం బయటకు వచ్చినప్పటి నుంచి అభిమానుల్లో హైప్ మరింత పెరిగిపోయింది.
జక్కన్న అప్‌డేట్స్ ఇవ్వకపోతే ఫ్యాన్స్ ఊరుకుంటారా?
రాజమౌళి నుంచి అధికారిక అప్‌డేట్స్ పెద్దగా రాకపోవడంతో అభిమానులు మాత్రం తమ క్రియేటివిటీకి పని చెబుతున్నారు.

ఒకరు రుద్ర యాక్షన్ సీక్వెన్స్‌లను ఊహించి వీడియోలు చేస్తుంటే.. మరొకరు రుద్ర, మందాకిని మధ్య సన్నివేశాలను ఊహించి AI వీడియోలను రూపొందిస్తున్నారు.

ఈ వీడియోలో రుద్ర మందాకినిని కాపాడే సీన్ చూసిన ఫ్యాన్స్.. ‘ఇలాంటి సీన్ సినిమాలో ఉంటే థియేటర్లలో రచ్చ మామూలుగా ఉండదు’ అంటూ కామెంట్లు చేస్తున్నారు.

మరికొందరైతే.. ‘ఫ్యాన్ మేడ్ వీడియోనే ఈ రేంజ్‌లో ఉంటే.. జక్కన్న అసలు విజువల్స్ ఎలా ఉంటాయో?’ అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి.. ‘వారణాసి’ నుంచి అధికారిక అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో.. ఈ AI వీడియోకు వచ్చిన రెస్పాన్స్ చూస్తేనే అర్థమవుతోంది.

ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్న వీడియోలతోనే సినిమాపై హైప్ రోజురోజుకూ పెరుగుతోంది. మరి అభిమానులు పెంచుతున్న ఈ భారీ అంచనాలను జక్కన్న తన అసలు విజువల్స్‌తో ఏ రేంజ్‌లో అందుకుంటాడో చూడాలి!

మరికొందరైతే.. ఫ్యాన్ మేడ్ వీడియోనే ఈ రేంజ్‌లో ఉంటే.. జక్కన్న అసలు విజువల్స్ ఎలా ఉంటాయో?’ అంటూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

మొత్తానికి.. ‘వారణాసి’ నుంచి అధికారిక అప్‌డేట్స్ కోసం అభిమానులు ఎంతగా ఎదురుచూస్తున్నారో.. ఈ AI వీడియోకు వచ్చిన రెస్పాన్స్ చూస్తేనే అర్థమవుతోంది.

ఫ్యాన్స్ క్రియేట్ చేస్తున్న వీడియోలతోనే సినిమాపై హైప్ రోజురోజుకూ పెరుగుతోంది. మరి అభిమానులు పెంచుతున్న ఈ భారీ అంచనాలను జక్కన్న తన అసలు విజువల్స్‌తో ఏ రేంజ్‌లో అందుకుంటాడో చూడాలి!

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు