Search
Close this search box.

  ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి?.. వైరల్ వార్తలపై పీఆర్ టీమ్ క్లారిటీ

August 6, 2026 11:47 PM | Aditya369 News

ఏపీ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి?.. వైరల్ వార్తలపై పీఆర్ టీమ్ క్లారిటీ

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవిని ఆంధ్రప్రదేశ్ అధికారిక బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించనున్నారంటూ గత కొద్ది రోజులుగా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది. రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధి, పారిశ్రామిక పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయనను బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంపిక చేయనున్నారని, త్వరలో అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉందంటూ ఊహాగానాలు వినిపించాయి.

గుజరాత్ పర్యాటక రంగానికి అమితాబ్ బచ్చన్ బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించిన తరహాలోనే, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం చిరంజీవిని రంగంలోకి దించనున్నారనే ప్రచారం సోషల్ మీడియాలో హల్‌చల్ చేసింది. దీంతో అభిమానుల్లో కూడా ఈ వార్తపై ఆసక్తి నెలకొంది.

అయితే ఈ ప్రచారంపై చిరంజీవి పీఆర్ టీమ్ స్పందిస్తూ, ఇందులో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ బ్రాండ్ అంబాసిడర్‌గా చిరంజీవి నియామకంపై ఎలాంటి చర్చలు లేదా నిర్ణయాలు జరగలేదని తెలిపింది. ఆధారంలేని వార్తలు, ఊహాగానాలను నమ్మవద్దని అభిమానులు, ప్రజలకు విజ్ఞప్తి చేయడంతో ఈ ప్రచారానికి తెరపడింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు