మాస్ మహారాజా రవితేజ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘ఇరుముడి’పై ఆసక్తికరమైన అప్‌డేట్ వెలువడింది. ఆధ్యాత్మిక నేపథ్యంతో పాటు డాటర్ సెంటిమెంట్‌తో రూపొందుతున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు ప్రముఖ సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు. తాజాగా ఆయన అధికారిక ఎక్స్ ఖాతాలో చేసిన ఓ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
‘ఇరుముడి’ కోసం ‘బంగారు పల్లకి’ అంటూ సాగే ఓ ప్రత్యేకమైన పాటను రికార్డ్ చేసినట్లు జి.వి. ప్రకాష్ వెల్లడించారు. అంతేకాకుండా #mallepoolapallaki అనే హ్యాష్‌ట్యాగ్‌ను జత చేయడంతో ఈ పాటపై మరింత ఆసక్తి నెలకొంది. తెలుగులో ఇప్పటికే మంచి ఫ్యాన్ బేస్ ఉన్న ఈ పాటను ‘ఇరుముడి’ కోసం రీమిక్స్ చేస్తున్నట్లు తెలుస్తుండటంతో రవితేజ అభిమానుల్లో అంచనాలు మరింత పెరిగాయి.
మ్యూజిక్ టీమ్‌తో పాటు చిత్రబృందంలోని కీలక సభ్యులతో కలిసి జి.వి. ప్రకాష్ షేర్ చేసిన ఫొటో కూడా నెట్టింట వైరల్ అవుతోంది. ఆధ్యాత్మికత, సంప్రదాయ భావోద్వేగాలను కలగలిపి ఈ సినిమాకు ప్రత్యేకమైన ఆల్బమ్‌ను అందించేందుకు టీమ్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ‘బంగారు పల్లకి’ పాటను ఎప్పుడు విడుదల చేస్తారనే విషయంపై మేకర్స్ త్వరలోనే అధికారిక ప్రకటన చేయనున్నట్లు సమాచారం.









