సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ చేయడం అంత సులభమైన విషయం కాదు. సందర్భానికి తగ్గట్టుగా స్పాంటేనిటీతో వ్యవహరిస్తూ, ప్రేక్షకులను ఆకట్టుకోవడం ఒక సవాలుతో కూడుకున్న పని. అయితే ఇటీవల లీడింగ్ యాంకర్లతో పాటు కొత్త ముఖం చర్మిల నల్లూరి తన ప్రత్యేకమైన శైలితో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తోంది. వరుస సినిమా ఈవెంట్లకు యాంకరింగ్ చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటోంది.
చర్మిల అందంతో పాటు సినిమా ఈవెంట్లను ఎంతో చురుకుగా, స్పాంటేనియస్‌గా హ్యాండిల్ చేయడం ఆమెకు ప్లస్‌గా మారింది. ఆమె ప్రతిభకు ఆకర్షితులైన స్టార్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, స్టార్ ప్రొడ్యూసర్ కమ్ డైరెక్టర్ ఎమ్.ఎస్. రాజు సైతం తమ సినిమాల్లో హీరోయిన్గా నటిస్తావా అని అడిగినట్లు తెలుస్తోంది. దీంతో చర్మిల త్వరలోనే నటిగా కూడా కనిపిస్తుందా అనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.
ఇటీవలే తెలుగు యువతలో మంచి క్రేజ్ సంపాదించుకున్న చర్మిల నల్లూరిని ఎన్టీవీ వెబ్ ప్రత్యేకంగా ఇంటర్వ్యూ చేసింది. ఈ సందర్భంగా ఆమె తన నేపథ్యం, యాంకరింగ్ ప్రయాణం, భవిష్యత్ లక్ష్యాలు, తన మనసులోని మాటలను ప్రేక్షకులతో పంచుకుంది. ఆమెకు సంబంధించిన మరిన్ని ఆసక్తికర విషయాలు ఈ ఇంటర్వ్యూలో వెల్లడయ్యాయి.







