Search
Close this search box.

  ‘అలియాస్ రుక్మిణి’ టైటిల్ రివీల్… నితిన్‌కు హిట్ సిగ్నల్..?

August 3, 2026 11:30 PM | Aditya369 News

‘అలియాస్ రుక్మిణి’ టైటిల్ రివీల్… నితిన్‌కు హిట్ సిగ్నల్..?

టాలీవుడ్‌లో నేచురల్ స్టార్‌గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్న నాని… ఒకవైపు హీరోగా వరుస సినిమాలు చేస్తూనే, మరోవైపు నిర్మాతగా కూడా తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ సినిమాలో హీరోగా నటిస్తున్న ఆయన, తాజాగా నిర్మాతగా మరో కొత్త ప్రాజెక్ట్‌ను అధికారికంగా ప్రకటించారు. గత కొద్ది రోజులుగా వినిపిస్తున్న రూమర్స్‌కు చెక్ పెడుతూ, నితిన్ హీరోగా ఈ చిత్రాన్ని ప్రకటించడం విశేషం

సోమవారం హైదరాబాద్‌లో ఈ ప్రాజెక్ట్‌ను లాంఛనంగా ప్రారంభించారు. ‘దండోరా’ ఫేమ్ మురళి కాంత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి ‘అలియాస్ రుక్మిణి’ అనే అచ్చతెలుగు టైటిల్‌ను ఫిక్స్ చేస్తూ గ్లింప్స్‌ను విడుదల చేశారు.

గ్లింప్స్ నాని వాయిస్ ఓవర్‌తో ప్రారంభమవుతుంది. ఇంజనీరింగ్ పుస్తకాల మధ్య నిద్రపోతున్న హీరోని చూపిస్తూ, పక్కనే “గరం గోపాల్”, “ఆమెకు ఆమె అంటే ఇష్టం”, “వ్రతం వెంకన్న” వంటి పుస్తకాలను చూపిస్తారు. ఇవన్నీ ‘రుక్మిణి’ అనే రచయిత్రి రాసినవని తెలుస్తుంది. ఆ రుక్మిణి ఎవరో అనుకునేలోపే, నిద్ర లేచిన నితిన్ తన కళ్లద్దాలు సరిచేసుకుంటూ “ఆమె నా భార్య… మై వైఫ్” అని చెప్పడం గ్లింప్స్‌కు హైలైట్‌గా నిలుస్తుంది.

ఇలా రొమాంటిక్ నవలలు రాసే భార్యతో ఉన్న హీరో జీవితం ఎలా ఉంటుందో అన్న ఆసక్తిని రేకెత్తించేలా కథ ఉండబోతుందనే ఫీలింగ్ వస్తోంది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని మేకర్స్ తెలిపారు. విజయ్ బుల్గానిన్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ గ్లింప్స్‌కు మరింత ఆకర్షణ తీసుకొచ్చింది.

సినీ డిస్ట్రిబ్యూటర్ సుధాకర్ రెడ్డి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన నితిన్, తేజ దర్శకత్వంలో వచ్చిన ‘జయం’తో హీరోగా పరిచయం అయ్యారు. ఆ తర్వాత ‘సై’, ‘ఇష్క్’, ‘దిల్’, ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి హిట్ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

అయితే ఇటీవల కాలంలో ‘రంగ్ దే’, ‘మాస్ట్రో’ సినిమాలు ఓకే అనిపించుకున్నా… ‘మాచర్ల నియోజకవర్గం’, ‘ఎక్స్ట్రా ఆర్డినరీ మ్యాన్’, ‘తమ్ముడు’, ‘రాబిన్ హుడ్’ వంటి చిత్రాలు ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేకపోయాయి. దీంతో ఈసారి కొత్త కాన్సెప్ట్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తున్న నితిన్‌పై ప్రత్యేక దృష్టి ఉంది.

తాజాగా విడుదలైన టైటిల్ గ్లింప్స్ సినిమాపై మంచి అంచనాలు పెంచింది. ముఖ్యంగా మ్యూజిక్ బలంగా ఉండబోతుందనే హింట్ కూడా ఇచ్చింది. ఈ చిత్రంతో నితిన్ మళ్లీ హిట్ ట్రాక్‌లోకి వస్తాడనే అభిప్రాయాలు ఇండస్ట్రీలో వినిపిస్తున్నాయి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు