Search
Close this search box.

  Rashmika Mandanna: ‘వరుసగా ఇది మూడో గాయం’.. తన హెల్త్‌పై రష్మిక కీలక అప్‌డేట్

August 3, 2026 10:57 PM | Aditya369 News

Rashmika Mandanna: ‘వరుసగా ఇది మూడో గాయం’.. తన హెల్త్‌పై రష్మిక కీలక అప్‌డేట్

స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా ఇటీవల ‘మైసా’ సినిమా షూటింగ్‌లో గాయపడిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదం కారణంగా కొంతకాలంగా సోషల్ మీడియాకు దూరంగా ఉన్న ఆమె.. తాజాగా తన ఆరోగ్య పరిస్థితిపై అభిమానులకు సుదీర్ఘ పోస్ట్ ద్వారా వివరాలు వెల్లడించారు. వరుసగా ఇది తనకు మూడో గాయం అని, ఇకపై తన శరీరాన్ని మెషిన్‌లా కాకుండా మరింత జాగ్రత్తగా చూసుకోవాలని నేర్చుకుంటున్నానని రష్మిక పేర్కొన్నారు.

‘మైసా’ షూటింగ్‌లో డ్యాన్స్ సీక్వెన్స్ చేస్తుండగా తనకు గాయం అయినట్లు రష్మిక తెలిపారు. హిప్ ప్రాంతంలోని నాలుగు టెండన్లలో ఒకటి విడిపోయిందని, అది తిరిగి కలిసే వరకు కాలు పైకి ఎత్తడం వంటి కొన్ని కదలికలు కష్టంగా ఉంటాయని వెల్లడించారు. ఈ సినిమా తన కెరీర్‌లోనే అత్యంత యాక్షన్, ఎనర్జిటిక్ మూవీగా అనిపిస్తోందని సరదాగా చెప్పారు. ప్రస్తుతం నొప్పి ఉన్నప్పటికీ భరించలేనంతగా లేదని, వైద్యుల సూచనల మేరకు విశ్రాంతి తీసుకుంటున్నానని తెలిపారు.

గాయం కారణంగా వచ్చిన ఖాళీ సమయాన్ని ‘ఫోర్స్‌డ్ హాలిడే’గా భావిస్తున్నానని రష్మిక అన్నారు. ప్రస్తుతం పజిల్స్ చేస్తూ సమయాన్ని గడుపుతున్నానని, వర్కౌట్స్, రన్నింగ్‌కు దూరంగా ఉండాల్సి రావడంతో బరువు పెరుగుతానేమోనని సరదాగా ఆందోళన వ్యక్తం చేశారు. తన ఆరోగ్యం గురించి అభిమానులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, త్వరలోనే మరిన్ని అప్‌డేట్స్ ఇస్తానని రష్మిక తెలిపారు. ఆమె చేసిన పోస్ట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు