Search
Close this search box.

  రిషబ్ శెట్టికి నాగవంశీ షాక్..? భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా..!

July 30, 2026 6:32 AM | Aditya369 News

రిషబ్ శెట్టికి నాగవంశీ షాక్..? భారీ ప్రాజెక్ట్ ఆగిపోయిందా..!

'కాంతార'తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోని 'జై హనుమాన్', అలాగే 'ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్' చిత్రాల్లో నటిస్తున్న ఆయనకు సంబంధించిన మరో ప్రాజెక్ట్‌పై తాజాగా ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మాణంలో, దర్శకుడు అశ్విన్ గంగరాజు తెరకెక్కించాల్సిన భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా నిలిచిపోయినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై గతంలో మంచి అంచనాలు నెలకొన్నప్పటికీ, ప్రస్తుతం అది ముందుకు సాగడం లేదని టాక్ వినిపిస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, రిషబ్ శెట్టి మరియు నిర్మాత నాగవంశీ మధ్య రెమ్యూనరేషన్‌కు సంబంధించిన చర్చలు ఆశించిన విధంగా సానుకూలంగా ముగియలేదని తెలుస్తోంది. పారితోషిక అంశంలో ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది.

అయితే, ఈ వార్తలపై చిత్రబృందం లేదా సంబంధిత వర్గాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా రద్దయిందా, లేక భవిష్యత్తులో మళ్లీ పట్టాలెక్కుతుందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

‘కాంతార’తో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న రిషబ్ శెట్టి ప్రస్తుతం వరుస భారీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలోని ‘జై హనుమాన్’, అలాగే ‘ది ప్రైడ్ ఆఫ్ భారత్: ఛత్రపతి శివాజీ మహారాజ్’ చిత్రాల్లో నటిస్తున్న ఆయనకు సంబంధించిన మరో ప్రాజెక్ట్‌పై తాజాగా ఆసక్తికరమైన వార్త ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.

టాలీవుడ్ ప్రముఖ నిర్మాత నాగవంశీ నిర్మాణంలో, దర్శకుడు అశ్విన్ గంగరాజు తెరకెక్కించాల్సిన భారీ హిస్టారికల్ యాక్షన్ డ్రామా నిలిచిపోయినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ప్రాజెక్ట్‌పై గతంలో మంచి అంచనాలు నెలకొన్నప్పటికీ, ప్రస్తుతం అది ముందుకు సాగడం లేదని టాక్ వినిపిస్తోంది.

ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం, రిషబ్ శెట్టి మరియు నిర్మాత నాగవంశీ మధ్య రెమ్యూనరేషన్‌కు సంబంధించిన చర్చలు ఆశించిన విధంగా సానుకూలంగా ముగియలేదని తెలుస్తోంది. పారితోషిక అంశంలో ఇరువర్గాల మధ్య ఏకాభిప్రాయం కుదరకపోవడంతో ఈ ప్రాజెక్ట్‌ను తాత్కాలికంగా పక్కన పెట్టినట్లు ప్రచారం సాగుతోంది.

అయితే, ఈ వార్తలపై చిత్రబృందం లేదా సంబంధిత వర్గాల నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. దీంతో ఈ ప్రాజెక్ట్ పూర్తిగా రద్దయిందా, లేక భవిష్యత్తులో మళ్లీ పట్టాలెక్కుతుందా అనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు