Search
Close this search box.

  ఎన్టీఆర్ కెరీర్‌లో మరో భారీ ప్రయోగం..! ‘గాడ్ ఆఫ్ వార్’పై ఆసక్తికర అప్‌డేట్..!

July 19, 2026 9:48 PM | Aditya369 News

ఎన్టీఆర్ కెరీర్‌లో మరో భారీ ప్రయోగం..! ‘గాడ్ ఆఫ్ వార్’పై ఆసక్తికర అప్‌డేట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కనున్న పాన్-ఇండియా మైథాలజికల్ యాక్షన్ ఎపిక్ ‘గాడ్ ఆఫ్ వార్’పై రోజురోజుకీ అంచనాలు పెరుగుతున్నాయి. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ‘అరవింద సమేత’ తర్వాత వస్తున్న సినిమా కావడంతో ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది.

ఇక పురాణ కథలపై త్రివిక్రమ్‌కు ఉన్న అవగాహన, వాటిని ఆధునిక ప్రేక్షకులకు కనెక్ట్ చేసే విధానం ఈ సినిమాకు ప్రధాన బలంగా మారనుందని తెలుస్తోంది. సినిమా ప్రకటించినప్పటి నుంచే కథకు సంబంధించి పలు రూమర్లు, చర్చలు తెరపైకి వచ్చాయి.

ముఖ్యంగా “ఉత్తరంలో జన్మించి, దక్షిణంలో ఆరాధించబడే దేవుడు” అనే కాన్సెప్ట్ చుట్టూ ఆసక్తికరమైన చర్చలు జరిగాయి. అయితే, అసలు కథను మాత్రం చిత్ర బృందం పూర్తిగా గోప్యంగా ఉంచుతోంది.

ఈ సినిమాలో భగవంతుడు కార్తికేయుడి జీవితంలోని ఎవరికీ తెలియని అంశాలను చూపించనున్నారని సమాచారం. కేవలం ఆయన జన్మ కథ మాత్రమే కాకుండా.. ఆయన చేసిన గొప్ప యుద్ధాలు, వీరగాథలు, శక్తి సామర్థ్యాలను కూడా భారీ స్థాయిలో ఆవిష్కరించనున్నట్లు టాక్ వినిపిస్తోంది.

విజువల్‌గా గ్రాండ్ స్కేల్‌లో తెరకెక్కనున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ డిసెంబర్ నుంచి ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఈ భారీ ప్రాజెక్ట్‌ను Harika & Hassine Creations మరియు Fortune Four Cinemas సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో నటించే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలను చిత్ర బృందం త్వరలో ప్రకటించనుంది. ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలయికలో రాబోతున్న ఈ మైథాలజికల్ ఎపిక్ ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు