Search
Close this search box.

  ఫ్లాష్‌బ్యాక్‌లో వైల్డ్ అవతార్‌లో ప్రభాస్.. ‘స్పిరిట్’పై భారీ అంచనాలు..!

July 19, 2026 9:45 PM | Aditya369 News

ఫ్లాష్‌బ్యాక్‌లో వైల్డ్ అవతార్‌లో ప్రభాస్.. ‘స్పిరిట్’పై భారీ అంచనాలు..!

పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ చిత్రం ‘స్పిరిట్’ పై రోజుకో ఆసక్తికరమైన అప్‌డేట్ వినిపిస్తోంది. ఈ సినిమా కథ, ప్రభాస్ పాత్ర గురించి ఇప్పటికే భారీ అంచనాలు నెలకొనగా.. తాజాగా ఈ చిత్రంలోని ఇంటర్వెల్ బ్లాక్‌పై ఓ ఆసక్తికరమైన రూమర్ వైరల్ అవుతోంది.

సినిమా మొదటి భాగంలో ప్రభాస్ ఓ సిన్సియర్, రూత్‌లెస్ పోలీస్ ఆఫీసర్‌గా కనిపించనున్నాడని సమాచారం. ఆయన దర్యాప్తు చేస్తున్న ఓ కీలక కేసు చుట్టూనే ఫస్ట్ హాఫ్ సాగుతుందని, అయితే ఆ కేసు వెనుక ఉన్న అసలు నిజం ఇంటర్వెల్ సమయంలో రివీల్ అవుతుందని టాక్ వినిపిస్తోంది.

ముఖ్యంగా ఈ ట్విస్ట్ ప్రభాస్ పాత్ర వ్యక్తిగత జీవితానికి, అతను వెతుకుతున్న విలన్‌కు మధ్య ఉన్న బలమైన సంబంధాన్ని బయటపెడుతుందని ప్రచారం జరుగుతోంది. ఈ ఇంటర్వెల్ ఎపిసోడ్ ప్రేక్షకులను థ్రిల్ చేసే విధంగా ఉంటుందని చిత్ర బృందం భావిస్తున్నట్లు సమాచారం.

ఇక ఈ సినిమాలో ప్రభాస్ మరోసారి తన మాస్ ఇమేజ్‌ను కొత్త కోణంలో చూపించబోతున్నాడని తెలుస్తోంది. ముఖ్యంగా ఫ్లాష్‌బ్యాక్ ఎపిసోడ్‌లో ఆయన వైల్డ్ అండ్ పవర్‌ఫుల్ లుక్‌లో కనిపించనున్నారని టాక్.

త్రుప్తి దిమ్రి హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని T-Series మరియు భద్రకాళి పిక్చర్స్ భారీ స్థాయిలో నిర్మించనున్నాయి. పోలీస్ బ్యాక్‌డ్రాప్‌తో సరికొత్త కథాంశాన్ని చూపించబోతున్న సందీప్ రెడ్డి వంగా నుంచి మరో ఇంటెన్స్ ప్రాజెక్ట్‌గా ‘స్పిరిట్’పై భారీ అంచనాలు ఉన్నాయి.

అయితే, ఈ ఇంటర్వెల్ ట్విస్ట్‌కు సంబంధించిన వివరాలపై చిత్ర బృందం నుంచి అధికారిక ప్రకటన వెలువడలేదు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు