Search
Close this search box.

  ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి: రన్‌టైమ్ ఫిక్స్.. ఉగాది కానుకగా మార్చి 19నే విడుదల!

March 10, 2026 9:27 PM | Aditya369 News

‘ఉస్తాద్ భగత్ సింగ్’ సెన్సార్ పూర్తి: రన్‌టైమ్ ఫిక్స్.. ఉగాది కానుకగా మార్చి 19నే విడుదల!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్, దర్శకుడు హరీశ్ శంకర్ కాంబినేషన్‌లో వస్తున్న హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విడుదలకు ముహూర్తం ఖరారైంది. తాజాగా ఈ చిత్రం సెన్సార్ కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసుకుంది. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్ (CBFC) ఈ సినిమాకు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ఒక పవర్‌ఫుల్ పోస్టర్‌ ద్వారా అధికారికంగా ధ్రువీకరించింది.
ఈ సినిమా విడుదల తేదీలో ఒక కీలక మార్పు చోటుచేసుకుంది. తొలుత మార్చి 26న విడుదల చేయాలని భావించినప్పటికీ, యశ్ నటించిన ‘టాక్సిక్’ సినిమా వాయిదా పడటంతో ఆ స్లాట్‌ను ఈ చిత్రం దక్కించుకుంది. దీంతో ఉగాది పండుగను పురస్కరించుకుని మార్చి 19న ఈ సినిమాను ప్రపంచవ్యాప్తంగా విడుదల చేయనున్నారు. ప్రేక్షకులను ఉర్రూతలూగించే ఈ యాక్షన్ డ్రామా రన్‌టైమ్‌ను కూడా 2 గంటల 29 నిమిషాలుగా ఖరారు చేశారు. క్రిస్పీ రన్‌టైమ్ సినిమాకు ప్లస్ అవుతుందని ట్రేడ్ వర్గాలు భావిస్తున్నాయి.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. దేవి శ్రీ ప్రసాద్ పాటలు స్వరపరచగా, ఎస్.ఎస్. తమన్ నేపథ్య సంగీతం అందిస్తున్నారు. ‘గబ్బర్ సింగ్’ వంటి బ్లాక్ బస్టర్ తర్వాత పవన్-హరీశ్ కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఇప్పటికే విడుదలైన టీజర్, పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుండగా, మార్చి 19న థియేటర్లలో పవర్ స్టార్ పూనకాలు ఖాయమని అభిమానులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు