Search
Close this search box.

  కాకినాడ పెయింటర్ కుటుంబానికి జనసేన నాయకుల సాయం

February 27, 2026 11:30 AM | Aditya369 News

కాకినాడ పెయింటర్ కుటుంబానికి జనసేన నాయకుల సాయం

కాకినాడ పెయింటర్ ప్రమాదానికి గురై మంచానికే పరిమితమవడంతో జనసేన నాయకులు మానవతా దృక్పథంతో సాయం చేశారు. కాకినాడ రాగంపేటకు చెందిన వి. సూర్యనారాయణ పెయింటింగ్ చేస్తూ తన కుటుంబాన్ని పోషించేవారు.గత జనవరిలో పెయింటింగ్ పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తు కిందపడిపోయారు.ఈ ప్రమాదంలో ఆయన వెన్నెముక తీవ్రంగా దెబ్బతిని, ప్రస్తుతం లేవలేని స్థితికి చేరుకున్నారు. సరైన వైద్యం చేయించుకునే ఆర్థిక స్థోమత లేక మంచానికే పరిమితమయ్యారు. కుటుంబ పోషణ కష్టతరంగా మారింది. విషయం తెలుసుకున్న జనసేన ఉభయగోదావరి జిల్లాల ఎలక్షన్ కో-కన్వీనర్ నున్న గణేష్ నాయుడు జన్మదినం సందర్భంగా కరప మార్కెట్ యార్డు డైరెక్టర్ విష్ణు నాయుడు, ఆచంట ప్రవీణ్, నున్ను సురేందర్, శ్రీపతి గణేష్, మల్లె పవన్ కుమార్, సంజయ్ తదితరులు కలిసి నెలకు సరిపడ నిత్యావసర సరుకులను అందజేశారు. అలాగే ప్రభుత్వ పెన్షన్ మంజూరు చేయించేందుకు తమ వంతు సహకారం అందిస్తామని కుటుంబానికి భరోసా ఇచ్చారు.

WhatsApp
Telegram
Email  
Pinterest
Twitter

Playstore

 మరిన్ని వార్తలు