పిఠాపురం ఐసిడిఎస్ ప్రాజెక్ట్ కార్యాలయం వద్ద అంగన్వాడీలు సమ్మె ఒప్పందాలను అమలు చేయాలని,సమస్యల పరిష్కరిం చాలని డిమాండ్ చేస్తూ రిలే నిరాహార దీక్ష చేపట్టారు.ఈ దీక్షలను ఎపి అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు డి పద్మావతి ప్రారంభించి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె కాలపు ఒప్పందాలను అమలు చేయాలన్నారు.సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం కనీస వేతనం, గ్రాడ్యుటి అమలు చేయాలని,ప్రీస్కూల్ విద్యార్థులకు తల్లికి వందనం పథకం అమలు చేయాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమంలో అంగన్వాడి యూనియన్ నాయకులు తులసిదేవి,విజయశాంతి,నళిని,వెంకటలక్ష్మీ,సత్యవతి, హేమలత,గౌరీ,రాఘవ మూడు మండలాల అంగన్వాడీ వర్కర్లు పాల్గొన్నారు.








