తుని ఏరియా ఆసుపత్రిని 200 పడకల ఆసుపత్రిగా ఆధునీకరిస్తాం అని ప్రభుత్వ విప్, తుని ఎమ్మెల్యే యనమల దివ్య అన్నారు.ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేసిన ఆమె ప్రతి వార్డును క్షుణ్ణంగా పరిశీలించి,సిబ్బంది పనితీరును రోగులను అడిగి తెలుసుకున్నారు.ఆసుపత్రికి సరిహద్దు ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో రోగులు వస్తున్నారని తుని ఏరియా ఆసుపత్రిని 200 పడకలుగా ఆధునికరించాలని ఆరోగ్యశాఖ మంత్రిని కోరడం జరిగిందని మంత్రి సానుకూలంగా స్పందించారని ఆమె తెలిపారు.








