అక్రమంగా తరలిస్తున్న తాబేళ్లను ఏలేశ్వరం అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.అటవీ శాఖ అధికారి దుర్గాప్రసాద్ మాట్లాడుతూ రామచంద్రాపురం నుండి కలకత్తాకు బొలెరో వాహనంపై తాబేళ్ళు తరలిస్తున్నట్లు సమాచారం అందిందన్నారు.వెంటనే తమ సిబ్బందితో జాతీయ రహదారి పై వాహన తనిఖీలు నిర్వహించగా 320 తాబేళ్ళు గోనిసంచెల్లో చుట్టుకుని బొలెరో వాహనంలో పెట్టి పైన ఎవరికీ అనుమానం రాకుండా చేపలు బుట్టలు వేశారన్నారు.ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఇద్దరు నిందితులను,బొలెరో వాహనాన్ని స్వాధీనం చేసుకుని తాబేళ్లను ఏలేరు రిజర్వాయర్లలో విడుదల చేశామన్నారు.








